High Cholesterol Sign: కొలెస్ట్రాల్ పెరిగితే.. శరీరంలోని ఈ భాగాలు ముందే సంకేతాలు ఇస్తాయి! పొరపాటున కూడా విస్మరించవద్దు

These are the warning signs of high cholesterol. చెడు కొలెస్ట్రాల్‌ మన శరీరంలో ఎక్కువైంది అని కొన్ని సంకేతాల ద్వారా మనకు ముందే తెలుస్తుంది. 

Written by - P Sampath Kumar | Last Updated : Jul 22, 2022, 08:35 PM IST
  • కొలెస్ట్రాల్ పెరిగితే
  • శరీరంలోని ఈ భాగాలు ముందే సంకేతాలు ఇస్తాయి
  • పొరపాటున కూడా విస్మరించవద్దు
High Cholesterol Sign: కొలెస్ట్రాల్ పెరిగితే.. శరీరంలోని ఈ భాగాలు ముందే సంకేతాలు ఇస్తాయి! పొరపాటున కూడా విస్మరించవద్దు

These are the warning signs of high cholesterol: ప్రస్తుతం ప్రతిఒక్కరి జీవితం ఉరుకుల పరుగుల మీద గడుస్తోంది. ఉద్యోగం, వ్యాపారం అంటూ గంటల సమయం గడిపేస్తున్నారు. ఈ బిజీ లైఫ్‌ స్టైల్‌ వల్ల కొందరు వ్యాయామానికి కూడా సమయం కేటాయించలేకపోతున్నారు. ఇది కాకుండా మనం ఎక్కువగా నూనెతో కూడిన ఆహార పదార్థాలను తీసుకుంటున్నాం. అది మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌)ను పెంచుతుంది. ఈ చెడు కొలెస్ట్రాల్ అధిక రక్తపోటు, మధుమేహం, హైపర్‌టెన్షన్‌‌, గుండెపోటుకు దారితీస్తుంది. 

శరీరంలో పెరుగుతున్న చెడు కొలెస్ట్రాల్‌ని సరిగ్గా గుర్తించడం రక్త పరీక్ష ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది. అయితే చెడు కొలెస్ట్రాల్‌ మన శరీరంలో ఎక్కువైంది అని కొన్ని సంకేతాల ద్వారా మనకు ముందే తెలుస్తుంది. కొలెస్ట్రాల్ ఎక్కువైనప్పుడు మన పాదాలలో నొప్పి పెరుగుతుంది. దీనిని గుర్తించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ సంకేతాన్ని మనం గుర్తించకపోతే.. ఆ తరువాత ప్రాణాంతకంగా మారొచ్చు. అధిక కొలెస్ట్రాల్ కారణంగా మన శరీరంలోని నరాలకు రక్త ప్రసరణ సరిగా ఉండదు. అందుకే పాదాలలో నొప్పి వస్తుంది. 

పాదాలలో తిమ్మిర్లు:
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం ప్రారంభించినప్పుడు.. ఆ వ్యక్తికి పాదాలలో తిమ్మిర్లు వస్తాయి. రాత్రి వేళ నిద్రిస్తున్నప్పుడు చాలా సార్లు కాళ్ళలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. అయితే కాసేపు నిలబడడంతో రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది. 

గోర్ల రంగు మార్పు:
శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయులు ఎక్కువగా ఉంటే.. పాదాలు మరియు గోర్లు రంగు మారుతుంది. మెల్లగా పసుపు రంగులోకి మారడం ప్రారంభిస్తాయి. పాదాలకు రక్త సరఫరా సరిగా జరగకపోవడం వల్ల ఇలా జరుగుతుంది.

కళ్లలో మైనపు పొర:
శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే.. కళ్లలో కూడా కొన్ని మార్పులు కనిపిస్తాయి. పసుపు, నారింజ రంగుల మైనపు పొర కళ్ల మూలలో రావడం ప్రారంభిస్తాయి. చర్మం కింద కొలెస్ట్రాల్ పేరుకుపోవడమే దీనికి అసలు కారణం.

పాదాలు చల్లగా ఉండటం:
చలి కాలంలో పాదాలు చల్లగా ఉండటం సర్వసాధారణం. అయితే వేసవి ఉష్ణోగ్రతలో కూడా పాదాలు అకస్మాత్తుగా చల్లగా మారినట్లయితే.. శరీరంలో కొలెస్ట్రాల్ ఉన్నట్లే. 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News