Tamannaah Feels Like A Goddess : దేవ‌త‌ గెటప్‌లో త‌మ‌న్నా.. అరటాకులో భోజ‌నం

Tamannaah Bhatia "Feels Like A Goddess" Only When She... : ఎప్పుడూ ట్రెండీ కాస్ట్యూమ్స్ లో తళుక్కుమనే త‌మ‌న్నా ఇపుడు న‌ల్ల చీర‌, బ్లౌజ్‌లో నెత్తిన కిరీటంతో, ఒంటి నిండా ఆభ‌ర‌ణాలు వేసుకుని అర‌టాకులో భోజనం చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అర‌టాకులో ఇడ్లీ, వ‌డ‌, దోస ఆర‌గిస్తున్న తమన్నా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 24, 2021, 08:19 PM IST
  • అరిటాకులో భోజనం చేసేటప్పుడు దేవతలా ఫీలవుతానంటున్న తమన్నా
  • మహాలక్ష్మీ అవతారంలో అరిటాకులో భోజనం చేసిన మిల్కీబ్యూటీ
  • అర‌టాకులో ఇడ్లీ, వ‌డ‌, దోస ఆర‌గిస్తున్న ఫోటోలు వైరల్
Tamannaah Feels Like A Goddess : దేవ‌త‌ గెటప్‌లో త‌మ‌న్నా.. అరటాకులో భోజ‌నం

Tamannaah Bhatia 'feels like a goddess' as she enjoys eating on a banana leaf: తమన్నా వరుస సినిమాలతో.. సిరీస్‌తో కెరీర్ పరంగా దూసుకెళ్తోంది. పాండమిక్ తర్వాత సీటీమార్, మ్యాస్ట్రో వంటి సినిమాల్లో నటించింది ఈ భామ. ఇక ఆహా లో లెవంత్ అవర్ సిరీస్‌తో ఆకట్టుకుంది. మాస్టర్ చెఫ్‌తో బుల్లితెరపై కూడా ఎంట్రీ ఇచ్చింది. అయితే కొన్ని కారణాల వల్ల కొద్దిరోజులకే వెనుదిరిగింది.

తమన్నా.. ప్రస్తుతం ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3తో (F2 Sequel F3) పాటు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సరసన భోళాశంకర్ మూవీలో నటిస్తోంది. ఇక తాజాగా షూటింగ్ స్పాట్ నుంచి తమన్నా షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 100% లవ్ మూవీలో దటీజ్ మహాలక్ష్మీగా (Mahalakshmi) అలరించింది ఈ మిల్కీబ్యూటీ (Milky Beauty). ఇప్పుడు అలాంటి మహాలక్ష్మీ అవతారంలో అరిటాకులో భోజనం చేసింది. ఎప్పుడూ ట్రెండీ కాస్ట్యూమ్స్ లో తళుక్కుమనే త‌మ‌న్నా ఇపుడు న‌ల్ల చీర‌, బ్లౌజ్‌లో నెత్తిన కిరీటంతో, ఒంటి నిండా ఆభ‌ర‌ణాలు వేసుకుని అర‌టాకులో (banana leaf) భోజనం చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

 

Also Read : మీ వద్ద ATM or credit cards ఉన్నాయా ? అయితే Free insurance ఆఫర్ ఉన్నట్టేనట!

అర‌టాకులో ఇడ్లీ, వ‌డ‌, దోస ఆర‌గిస్తున్న తమన్నా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఎఫ్ 3 సినిమా కోసం ఈ గెటప్ వేసింది తమన్నా. మూవీలో త‌న భ‌ర్త వెంక‌టేశ్ ను (Venkatesh) చేజింగ్ చేసే ప‌రాశ‌క్తిగా క‌నిపించ‌నుంద‌ట మిల్కీబ్యూటీ (Milky Beauty). ఇక త‌మ‌న్నా (Tamanna) పోస్ట్ చేసిన ఈ తాజా స్టిల్‌ను మెచ్చుకుంటూ చాలా మంది సెలబ్రిటీలు కామెంట్లు చేస్తున్నారు.

Also Read : IND Vs NZ: ఆ యువ ఆటగాడు ఉన్నాడు.. రాహుల్‌ లేని ప్రభావం జట్టుపై ఉండదు: రహానే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News