తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్..?

                

Last Updated : Oct 12, 2017, 04:55 PM IST
తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్..?

ఆంధ్రుల అభిమాన నటుడు మరియు మాజీ ఏపీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా ఒక చిత్రాన్ని తెరకెక్కించాలని భావిస్తున్నారు నటుడు నందమూరి బాలకృష్ణ. తానే ప్రధానపాత్రలో నటించనున్న ఆ సినిమాకు సంబంధించి స్క్రిప్టును కూడా తయారుచేయిస్తున్నారు. అయితే ఆ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారో త్వరలోనే వెల్లడిస్తానన్న బాలకృష్ణ ఆ తర్వాత ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. అయితే ఆ సినిమా బాధ్యతలను దర్శకుడు తేజ తీసుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. రానా నటించి ‘నేనే రాజు నేనే మంత్రి’తో చాలా రోజుల తర్వాత హిట్ సొంతం చేసుకున్న తేజ, త్వరలోనే తన దర్శకత్వంలో ఎన్టీఆర్‌ బయోపిక్‌ ప్రారంభం అవుతుందని ఫేస్‌బుక్‌ ద్వారా వెల్లడించారు. బాలకృష్ణ స్వయాన ఈ చిత్రాన్ని నిర్మిస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. 

Trending News