Telugu Indian Idol 3: తెలుగు ఇండియన్ ఐడల్ 3 నుంచి ఆ కంటెస్టెంట్ ఎలిమినేట్.. ఆ పని చేసి పెద్ద మనసు చాటుకున్న థమన్..

Telugu Indian Idol 3: ఆహా ఓటీటీలో ప్రతి వారం ప్రసారమవుతున్న ఇండియన్ ఐడల్  సీజన్ 3’ కార్యక్రమం ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా జరిగిన వీకెండ్ లో కుశాల్ శర్మ ఎలిమినేటర్ కావడంతో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 కాంపిటీషన్ రసవత్తరంగా మారింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 17, 2024, 12:40 PM IST
Telugu Indian Idol 3: తెలుగు ఇండియన్ ఐడల్ 3 నుంచి ఆ కంటెస్టెంట్ ఎలిమినేట్.. ఆ పని చేసి పెద్ద మనసు చాటుకున్న థమన్..

Telugu Indian Idol 3: ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో  జూన్ 14 న ప్రారంభమైన ఈ షో ఇప్పుడు కీలకమైన ఎలిమినేషన్ దశలోకి ప్రవేశించింది. ప్రేక్షకుల ఓటింగ్‌తో పాటు జడ్జెస్ స్కోర్‌లు  ఇందులో పాల్గొన్న అభ్యర్ధుల భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. శ్రీరామ్ చంద్ర హోస్ట్ చేసిన మొదటి ఎలిమినేషన్ రౌండ్లో, ముగ్గురు  కంటెస్టెంట్స్-స్కంద, భరత్ రాజ్  కుశాల్ శర్మ- జడ్జిల నుండి తక్కువ స్కోర్లు అందుకుని డేంజర్ జోన్‌లోకి ప్రవేశించారు. తోటి  కంటెస్టెంట్స్ భరత్ రాజ్,  స్కందతో కుశాల్ పోటీ పడ్డాడు. స్కంద అత్యధిక ఓట్లను పొంది, మొదట సేఫ్ అయ్యారు.  కుశాల్, భరత్‌ ఎలిమినేషన్ లోకి వచ్చారు. ఫైనల్ గా  ప్రేక్షకుల నుండి తక్కువ ఓట్లు పొందిన కుశాల్ ఎలిమినేట్ అయ్యాడు.

సింగర్  కార్తీక్ నుంచి ప్రేరణ పొందిన కుశాల్, షోలో తన ఎక్స్ పీరియన్స్ షేర్ చూస్తే..  'జీవితంలో ఒక్కసారే వచ్చే అవకాశం' అని చెప్పాడు. అతను ఈ వేదికని దేవాలయంగా, న్యాయనిర్ణేతలను తన మార్గదర్శక వ్యక్తులుగా పేర్కొన్నాడు. తనను ఎంతగానో ప్రోత్సహించిన థమన్‌, గీతా మాధురి, కార్తీక్‌ కు హృదయపూర్వక  కృతజ్ఞతలు తెలిపాడు.

ఎలిమినేషన్ అయినప్పటికీ, కుశాల్ పాజిటివ్ గా స్పందించాడు.  అతను పోటీ నుండి చాలా నేర్చుకున్నానని చెప్పుకొచ్చాడు. ఈ షోతో  విలువైన అనుభవాలను పొందానని చెప్పాడు. థమన్, కుశాల్ ప్రతిభని గుర్తించాడు. అతన్ని జెన్యూన్ కంటెస్టెంట్ అని అభినందించారు. భవిష్యత్ లో విజయం సాధించాలని ఆకాంక్షించాడు.

కుశాల్‌కు వీడ్కోలు పలికినప్పుడు తోటి అభ్యర్ధులు ఎమోషనల్ అయ్యారు. ఈ ఎలిమినేషన్‌తో, పోటీ తీవ్రమైంది. 11 మంది కంటెస్టెంట్స్ ప్రతిష్టాత్మకమైన టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. పెర్ఫార్మెన్స్ కొనసాగుతున్న కొద్దీ, పబ్లిక్ ఓటింగ్ , న్యాయనిర్ణేతల స్కోర్‌ల ఆధారంగా ప్రతి వారం ఒక అభ్యర్ధి ఎలిమినేట్ అవుతారు. చివరి వారాల్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు అవకాశం ఉంటుంది.

వీక్షకులు తెలుగు ఇండియన్ ఐడల్ విభాగానికి నామిగేట్ చేయడం ద్వారా లేదా ప్రతి కంటెస్టెంట్  కోసం నిర్దేశించిన నంబర్‌లకు మిస్డ్ కాల్స్ ఇవ్వడం ద్వారా లేదా ఆహా యాప్ ద్వారా తమ ఓట్లను వేయవచ్చు. ఓటింగ్ లైన్లు శుక్రవారం నుండి రాత్రి 7 గంటలకు తెరిచి ఉంటాయి. ఆదివారం ఉదయం 7 గంటల వరకు, అభిమానులు తమ వాయిస్  వినిపించేందుకు అనుమతిస్తారు.ప్రతి శుక్రవారం, శనివారం రాత్రి 7 గంటలకు ప్రత్యేకంగా ఆహాలో ప్రసారమయ్యే  ఇండియన్ ఐడల్ తెలుగు సీజన్ 3 అద్భుతమైన పెర్ఫార్మెన్స్, ఎమోషనల్ మూమెంట్స్ మిస్ కాకుండా చూడండి.

ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!

ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News