Telugu Movies In August 2023: ఈ వారం ఓటీటీ, థియేటర్‌లో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..!

This Week Theater And OTT Movies List: మిస్టర్ ప్రెగ్నెంట్, ప్రేమ్‌కుమార్, జిలేబీ వంటి చిన్న సినిమాలు ఈ వారం బాక్సాఫీసు ముందుకు రానున్నాయి. అదేవిధంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా పలు సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఆ లిస్ట్‌ను చూసేయండి..  

Written by - Ashok Krindinti | Last Updated : Aug 14, 2023, 12:11 PM IST
Telugu Movies In August 2023: ఈ వారం ఓటీటీ, థియేటర్‌లో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..!

This Week Theater And OTT Movies List: ఈ వారం చిన్న సినిమాలు బాక్సాఫీసు వద్ద సందడి చేసేందుకు రెడీ అవుతున్నాయి. గత వారం జైలర్, భోళా శంకర్ వంటి పెద్ద సినిమాలు ఆడియన్స్ ముందుకువచ్చాయి. వీటిలో జైలర్‌ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోగా.. భోళా శంకర్ మాత్రం డిజాస్టర్‌గా మిగిలింది. ఈ వారం ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఓటీటీలో కొన్ని సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. థియేటర్స్, ఓటీటీలో ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీగా ఉన్న మూవీస్‌పై ఓ లుక్కేయండి. 

బిగ్‌బాస్ ఫేమ్ సయ్యద్‌ సొహైల్‌, రూపా కొడువయూర్‌ హీరో హీరోయిన్స్‌గా  శ్రీనివాస్‌ వింజనంపాటి దర్శకత్వకంలో రూపొందిన మూవీ మిస్టర్‌ ప్రెగ్నెంట్‌ (Mr Pregnant). డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. సుహాసిని, అలీ, బ్రహ్మాజీ తదితరులు కీరోల్స్ ప్లే చేశారు. ఈ మూవీ ఆగస్టు 18న ఆడియన్స్ ముందుకు రానుంది.

యంగ్ హీరో సంతోష్‌ శోభన్‌ జోరుమీద ఉన్నాడు. మరో సినిమా 'ప్రేమ్‌కుమార్‌' (Premkumar)తో ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అయ్యాడు. ఈ మూవీలో రాశిసింగ్‌, రుచిత సాదినేని హీరోయిన్స్‌గా యాక్ట్ చేశారు. ఈ మూవీ ద్వారా రైటర్ అభిషేక్‌ మహర్షి డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నాడు. సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై శివప్రసాద్‌ పన్నీరు నిర్మించారు. ఈ నెల 18న థియేటర్లలో సందడి చేయనుంది. 

'నువ్వు నాకు నచ్చావ్‌', 'మల్లీశ్వరి' వంటి ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు డైరెక్టర్ కె.విజయభాస్కర్‌. ఇప్పుడు ఆయన తన తనయుడు శ్రీ కమల్‌ను హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. శ్రీ కమల్, శివానీ జంట నటించిన మూవీ 'జిలేబి' (Jilebi). ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్రలో నటించారు. గుంటూరు రామకృష్ణ నిర్మించారు. ఈ నెల 18న ఆడియన్స్ ముందుకురానుంది.

తమిళ నటుడు సంతానం తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో సుపరిచితమే. సంతానం కీలక పాత్రలో యాక్ట్ చేసిన లేటెస్ట్ హారర్‌ కామెడీ మూవీ 'డీడీ రిటర్న్స్‌ భూతాల బంగ్లా'. ఈ సినిమా ఇప్పటికే తమిళంలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా తెలుగులో ఆగస్టు 18న రిలీజ్ చేయనున్నారు.

నెట్‌ఫ్లిక్స్‌ ప్లాట్‌ఫామ్‌లో హాలీవుడ్ సినిమాలు అన్‌టోల్డ్‌: ఆల్‌ ఆఫ్‌ షేమ్‌, నో ఎస్కేప్‌ రూమ్‌ ఆగస్టు 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి. ఆగస్టు 16వ తేదీ డెప్‌ వర్సెస్‌ హర్డ్‌ అనే డాక్యుమెంటరీ సిరీస్‌ స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 18 నుంచి గన్స్‌ అండ్‌ గులాబ్స్‌ అనే హిందీ సిరీస్‌, మాస్క్‌ గర్ల్ అనే కొరియన్‌ సిరీస్‌ ఆడియన్స్‌కు అందుబాటులోకి రానుంది. 

అమెజాన్‌ ప్రైమ్‌లో హర్లాన్‌ కొబెన్స్‌ షెల్టర్‌ అనే వెబ్‌సిరీస్‌ ఆగస్టు 18వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. జీ5లో ఛత్రపతి హిందీ మూవీ ఆగస్టు 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. జియోలో
తాలీ, ఫ సే ఫాంటసీ అనే హిందీ సినిమాలు ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రేక్షకులకు అందుబాటులో ఉండనున్నాయి. 

Also Read: Ind Vs WI 5th T20 Highlights: మోస్ట్ ఓవర్‌రేటెడ్ ప్లేయర్.. హార్థిక్ పాండ్యాను ఆడుకుంటున్న ఫ్యాన్స్  

Also Read: Independence Day 2023: హైదరాబాద్ వాసులకు ముఖ్యగమనిక.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News