Prabhakar: ప్రభాకర్ వల్లే మరో బుల్లి తెర నటుడికి కరోనా ?

Telugu TV Serial Actors: తెలుగు టీవీ సీరియల్స్‌ను కూడా కరోనావైరస్ గండం వెంటాడుతోంది. లాక్‌డౌన్ సమయంలో నిలిచిపోయిన తెలుగు సినిమా, టీవీ సీరియల్స్ షూటింగ్స్ ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. అన్‌లాక్ - 1 ( Unlock-1 ) ప్రారంభం అయిన వెంటనే సినిమాలతో పాటు సీరియల్స్ షూటింగ్ సైతం ప్రారంభం అయ్యాయి.

Last Updated : Jun 26, 2020, 05:31 PM IST
Prabhakar: ప్రభాకర్ వల్లే మరో బుల్లి తెర నటుడికి కరోనా ?

Telugu TV Serial Actors: తెలుగు టీవీ సీరియల్స్‌ను కూడా కరోనావైరస్ గండం వెంటాడుతోంది. లాక్‌డౌన్ సమయంలో నిలిచిపోయిన తెలుగు సినిమా, టీవీ సీరియల్స్ షూటింగ్స్ ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. అన్‌లాక్ - 1 ( Unlock-1 ) ప్రారంభం అయిన వెంటనే సినిమాలతో పాటు సీరియల్స్ షూటింగ్ సైతం ప్రారంభం అయ్యాయి. అయితే అంతా సజావుగా సాగుతోంది అనుకుంటున్న సమయంలోనే షూటింగ్ టీమ్‌లో కరోనా కల్లోలం ( Coronavirus ) మొదలైంది. ఒక సీరీయల్‌కి చెందిన ప్రొడక్షన్ టీమ్‌లో కొంత మందికి కరోనా  ( Covid -19 ) సోకినట్టు వస్తున్న వార్తలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఒక తెలుగు సీరియల్‌లో నటిస్తోన్న నటుడు ప్రభాకర్ ( Prabhakar tested positive for Coronavirus ) కు కరోనా సంక్రమించింది.  దీంతో వెంటనే షూటింగ్‌ను నిలిపివేశారు. ప్రొడక్షన్ టీమ్‌ను హోమ్ క్వారంటైన్‌కు ( Home quarantine ) పంపించారు. ( Also read: CBSE board exams results 2020: సీబీఎస్ఈ ఫలితాలపై లేటెస్ట్ అప్‌డేట్స్ )

ప్రభాకర్‌కు కరోనావైరస్ పాటిజివ్‌గా గుర్తించినట్టు వార్తలు వెలువడుతున్న క్రమంలోనే హరికృష్ణ  ( Tv Actor Harikrishna ) అనే తెలుగు సీరియల్ నటుడికి కరోనా పాజిటీవ్ అని తేలింది. ఈ విషయం తెలియడంతో ఆయన నటిస్తున్న సీరియల్ షూటింగ్‌ని వెంటనే నిలిపివేశారు. అయితే హరికృష్ణ ఇటీవలే ప్రభాకర్‌ను కలిసినట్టు తెలిసింది.  దాంతో ప్రభాకర్‌కు కరోనా సోకినట్టు తేలిన అనంతరం ఆయనను కలిసిన మొత్తం 33 మందికి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించారు. వారిలో చాలా మంది ఫలితాలు ఇంకా రావాల్సి ఉందని తెలుస్తోంది.

Trending News