అక్కినేని నాగార్జున సినీ జర్నీ...

Last Updated : Aug 22, 2017, 04:16 PM IST
అక్కినేని నాగార్జున సినీ జర్నీ...

అక్కినేని నాగార్జున అంటే మన్మధుడిగా గుర్తిస్తారు తెలుగు మహిళా ప్రేక్షకులు. టాలీవుడ్ చరిత్రలో ప్రేమ కథ చిత్రాల కథనాయుకుడిగా నాగ్ కు మంచి పేరుంది. వయస్సు మీద పడ్డ కూడా నిత్య యవ్వన లక్షణం నాగార్జున సొంతం. తెలుగు చలనచిత్ర రంగంలో ఇది ఒక్క నాగ్ కే చెల్లుతుంది. డిఫరెంట్ క్యారెక్టర్ట్స్ తో తెలుగు ప్రేక్షకుల మదిలో శాస్వత స్థానం పొందిన అక్కినేని నాగార్జున 1960  ఆగస్ట్ 29న జన్మించారు. ఈయన ప్రసిద్ధ తెలుగు నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి కుమారుడు. చదువు పూర్తియిన తర్వాత నాగ్ ..తన తండ్రి బాటలోనే నటించి తండ్రికి తగ్గకొడుకుగా పేరు తెచ్చుకున్నారు.

అక్కినేని నాగార్జున తొలి చిత్రం విక్రం 1986 మే 23న విడులైంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. తొలినాళ్లలో నటించిన చిత్రాల్లో మజ్నూ, ఆఖరిపోరాటం, కలెక్టర్ గారి అబ్బాయి, గీతాంజలి చిత్రాలతో నాగ్ తన టాలెంట్ ఈ పాటిదో నిరూపించారు. అనంతరం రాంగోపాల్ శర్మ దర్శకత్వంలో తీసిన 'శివ' సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో నాగ్ ఓ రేంజ్ లో ఎదిగిపోయాడు. ఈ చిత్రంతో నాగ్ కు మాస్ ఫాలోయింగ్ ఎక్కువైంది. ఈ చిత్రం టాలీవుడ్ లో  మెగా హిట్ ఇవ్వడంతో దీన్ని హిందీలో కూడా రీమేక్ చేసి విడుదల చేశారు. ఈ చిత్రం హిందీలో కూడా మెగా హిట్ అయింది. దీంతో బాలీవుడ్ అభిమానాన్ని కూడా నాగ్ సంపాదించుకున్నారు. అనంతరం వచ్చిన చిత్రాలలో  ప్రెసిడెంట్ గారి పెళ్లాం, హలో బ్రదర్, నిన్నే పెళ్లాడుతా, అన్నమయ్య, శ్రీరామదాసు , సంతోషం, మన్మధుడు , మాస్, రగడ, గగనం, రాజన్న,కింగ్, గ్రీకువీరుడు, మనం లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు అక్కినేని నాగార్జున..

అవార్డులు...

1) అన్నమయ్య చిత్రంలో వాగ్గేయకారుడు అన్నమయ్య పాత్రను పోషించే సవాలును స్వీకరించి విజయం సాధించారు. ఈ సినిమా 42 కేంద్రాలలో 100 రోజులు పైగా నడిచింది. ఈ చిత్రానికి గాను నాగార్జున మొదటి సారిగా రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ఈ చిత్రంలో నాగార్జున కనపర్చిన అద్భుత నటనకు ప్రేక్షకుల నుండే కాకుండా విమర్శకుల నుండి కూడా అనేక ప్రశంసలు లభించాయి. అన్నమయ్య చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు.

2) 2006లో నాగార్జున తన తాజా చిత్రము శ్రీ రామదాసులో ముఖ్య పాత్రైన రామదాసును పోషించి విమర్శకుల ప్రశంశలందుకున్నారు. ఈ చిత్రానికి కె.రాఘవేంద్రరావు దర్శకత్వము వహించారు. ఈ చిత్రంలో నటనకు గాను నాగార్జున రాష్ట్ర ప్రభుత్వం నుండి మూడవ సారి ఉత్తమ నటుడి అవార్దు అందుకున్నారు. 2008వ సంవత్సరంలో వచ్చిన కింగ్ సినిమాలో నాగార్జున చేసిన అద్భుత నటనకు విమర్శకుల నుండి కూడా ప్రశంసలు వచ్చాయి.

Trending News