Bigg Boss 4 Contestants | తొలి సీజన్ బిగ్‌బాస్ 1కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించి సక్సెస్ అయ్యాడు. తనలో కొత్త వెరియేషన్ ఎలా ఉంటుందో చూపించాడు. బిగ్‌బాస్ 2లో నాని హోస్ట్‌గా చేయగా, చివర్లో కౌశల్ మండా వీరాభిమానులు సీజన్‌ను పీక్కు తీసుకెళ్ల కాస్త కన్ఫ్యూజ్ చేశారు. మూడో సీజన్‌ను కింగ్ నాగార్జున బాగా హ్యాండిల్ చేశారు.
ముఠా మేస్త్రి.. అల్లరి అల్లుడు.. నేనున్నాను.. లాంటి సూపర్ హిట్ తెలుగు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన కామాక్షి మూవీస్ అధినేత డి.శివప్రసాద్ రెడ్డి (62) చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ఈ రోజు ఉదయం ఆరున్నర గంటలకు కన్నుమూశారు.
ప్రముఖ కథానాయకులు అప్పుడప్పుడు గాయకులుగా కూడా తమ లక్ పరీక్షించుకున్నారు. అంటే సూపర్ స్టార్లు.. సూపర్ సింగర్స్‌గానూ రాణించి ప్రేక్షకుల నుండి నీరాజనాలు అందుకున్నారన్న మాట. మరి ఆ విశేషాలేమిటో మనమూ తెలుసుకుందాం..!
ఓంకార్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున ప్రత్యేక పాత్రలో నటిస్తున్న సినిమా ‘రాజుగారి గది 2’. మలయాళ సినిమా ‘ప్రేతమ్’ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇటీవలే ఈ చిత్ర నిర్మాతలు సినీ ప్రమోషన్లో భాగంగా ఓ పోస్టరును విడుదల చేశారు. ఈ పోస్టరులో సమంత టీచర్ గెటప్‌లో కనువిందు చేస్తూ .. క్లాస్ రూములో విద్యార్థుల ముందు బెత్తంతో నవ్వుతూ కనిపించడం కొసమెరుపు. తెల్ల పంచె, లాల్చీతో ఉన్న ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే ఈ చిత్రంలో సమంత పాత్ర ఏమిటి అన్న విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. అక్టోబరు 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఏ మాయ చేశావే.. అంటూ ఆమె ప్రేమలో మునిగితేలిన అక్కినేని వారసుడు.. ఆ అందాల భామ చిటికెన వ్రేలు పట్టుకొని.. ఏడడుగులు నడిచి.. వేద మంత్రాల నడుమ పసుపుతాడు కట్టి.. తన ప్రియసఖిని వివాహమాడాడు. గోవాలో శుక్రవారం జరిగిన అక్కినేని నాగార్జున కుమారుడైన నాగచైతన్య మరియు టాలీవుడ్ కథానాయిక సమంతల పెళ్ళి రంగరంగ వైభవంగా జరిగింది. కేవలం ప్రత్యేక ఆహ్వానం పొందిన పలువురు బంధు మిత్రులు, అతిథులు మధ్య జరిగిన ఈ వివాహ కార్యక్రమంలో, రాత్రి 11 గంటల 52 నిమిషాలకు ఏర్పడిన శుభ ముహుర్తంలో వధు, వరులిద్దరూ ఒక్కటయ్యారు.
రామ్ గోపాల్ వర్మ మొదటి చిత్రం "శివ" చిత్రం ఎన్ని రికార్డులు తిరగరాసిందో చెప్పక్కర్లేదు. అదే సినిమా అక్కినేని నాగార్జున సినీ జీవితాన్ని కూడా తిరగరాసింది. అలాగే తెలుగు సినీ చరిత్ర పేజీల్లో తనకుంటూ ఒక అధ్యాయాన్ని తయారుచేసుకున్న సినిమా అది. ఈ విషయాన్ని పక్కన పెడితే, గత కొన్ని నెలలుగా కొన్ని పుకార్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం ప్రారంభించాయి. రామ్ గోపాల్ వర్మ, నాగార్జున కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కబోతుందని, అది కూడా శివ సినిమా రేంజ్‌లోనే ఉంటుందని కొన్ని వార్తలు వచ్చాయి.
అక్కినేని నాగార్జున అంటే మన్మధుడిగా గుర్తిస్తారు తెలుగు మహిళా ప్రేక్షకులు. టాలీవుడ్ చరిత్రలో ప్రేమ కథ చిత్రాల కథనాయుకుడిగా నాగ్ కు మంచి పేరుంది. వయస్సు మీద పడ్డ కూడా నిత్య యవ్వన లక్షణం నాగార్జున సొంతం. తెలుగు చలనచిత్ర రంగంలో ఇది ఒక్క నాగ్ కే చెల్లుతుంది. డిఫరెంట్ క్యారెక్టర్ట్స్ తో తెలుగు ప్రేక్షకుల మదిలో శాస్వత స్థానం పొందిన అక్కినేని నాగార్జున 1960 ఆగస్ట్ 29న జన్మించారు. ఈయన ప్రసిద్ధ తెలుగు నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి కుమారుడు. చదువు పూర్తియిన తర్వాత నాగ్ ..తన తండ్రి బాటలోనే నటించి తండ్రికి తగ్గకొడుకుగా పేరు తెచ్చుకున్నారు.
అక్కినేని నాగార్జున అంటే మన్మధుడిగా గుర్తిస్తారు తెలుగు మహిళా ప్రేక్షకులు. టాలీవుడ్ చరిత్రలో ప్రేమ కథ చిత్రాల కథనాయుకుడిగా నాగ్ కు మంచి పేరుంది. వయస్సు మీద పడ్డ కూడా నిత్య యవ్వన లక్షణం నాగార్జున సొంతం. తెలుగు చలనచిత్ర రంగంలో ఇది ఒక్క నాగ్ కే చెల్లుతుంది. డిఫరెంట్ క్యారెక్టర్ట్స్ తో తెలుగు ప్రేక్షకుల మదిలో శాస్వత స్థానం పొందిన అక్కినేని నాగార్జున 1960 ఆగస్ట్ 29న జన్మించారు. ఈయన ప్రసిద్ధ తెలుగు నటుడు అక్కినేని నాగేశ్వరరావుగారి కుమారుడు. చదువు పూర్తియిన తర్వాత నాగ్ ..తన తండ్రి బాటలోనే నటించి తండ్రికి తగ్గకొడుకుగా పేరు తెచ్చుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.