The Kerala Story: 'ది కేర‌ళ స్టోరీ' ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఏ ఫ్టాట్‌ఫామ్‌లో ఎప్ప‌టి నుంచి అంటే.. ?

The Kerala Stroy OTT News: లాస్ట్ ఇయర్ దేశ వ్యాప్తంగా అత్యంత చర్చీనీయాంశం అయిన సినిమా 'ది కేరళ స్టోరీ'. కేరళలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా విడుదలైన 8 నెలలకు ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 7, 2024, 11:35 AM IST
The Kerala Story: 'ది కేర‌ళ స్టోరీ' ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఏ ఫ్టాట్‌ఫామ్‌లో ఎప్ప‌టి నుంచి అంటే.. ?

The Kerala Stroy OTT News: గత కొన్నేళ్లుగా ఓ సినిమా విడుదలైన తర్వాత మూడు వారాల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్గా నిలిచిన ది కేరళ స్టోరీ మూవీ మాత్రం విడుదలైన దాదాపు 8 నెలల తర్వాత ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5లో స్ట్రీమింగ్‌కు రాబోతుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేసారు. ఈ సినిమా ఈ నెల 16 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5లో స్ట్రీమింగ్‌ కానుంది.  ఆ సంగతి పక్కన పెడితే... కేరళ రాష్ట్రంలో జరిగిన లవ్ జిహాద్ కారణంగా బలైన హిందూ, క్రిష్టియన్ అమ్మాయిలు ఎలా లవ్ ట్రాప్‌లో పడి .. ఐసిస్ క్యాంపుల్లో చేరి సెక్సు బానిసలుగా మారిన కేరళ అమ్మాయిలు నిజ జీవిత గాథ ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు సుదీప్తో సేన్.. ఎంతో రీసెర్చి చేసి తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని విపుల్ అమృత్ లాల్ షా నిర్మించారు.

ఈ సినిమాలో ఓ వర్గం వారికి కించపరిచేలా ఉందని అప్పట్లో కేరళ, తమిళనాడు, పశ్చిమ బంగాల్ వంటి ప్రభుత్వాలు ఈ సినిమాను అక్కడ రిలీజ్ కాకుండా అడ్డుకున్నాయి. తీరా సుప్రీంకోర్టు జోక్యంతో అక్కడ ఈ సినిమాలు ఆయా రాష్ట్రాల్లో విడుదలయ్యాయి. మంచి విజయాన్ని సాధించాయి. 'ది కేరళ స్టోరీ' సినిమాను లవ్ జిహాద్ పేరిట 32 వేలకు పైగా అమాయకులైన హిందూ, క్రిష్టియన్ అమ్మాయిలను ఇస్లామ్ మతంలోకి మార్చి వారిని ఐసిస్ క్యాంపుల్లో పంపించి వారిని దేశ వ్యతిరేకులుగా ఎలా మారుస్తున్నారనే విషయాన్ని కేరళ స్టోరీ మూవీలో చక్కగా ఆవిష్కరించారు దర్శకుడు. కులాలకు మతాలకు అతీతంగా ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పేమి కాదు. మన దగ్గర ఎంతో మంది  మతాంతర వివాహాలు చేసుకున్న వారు సంతోషంగా ఉన్నారు. కానీ లవ్ జిహాద్ పేరిట ప్రేమించిన అమ్మాయిలను ఐసీస్ క్యాంపుల్లో చేర్పించి వారిని అక్కడ సెక్స్ బానిసలుగా మార్చడం.. వారు అప్పటి వరకు ఆరాధించిన మతాన్ని ద్వేషించేలా చేయడాన్నే అందరు తప్పు పడుతున్నారు.

ఈ సినిమా ఆర్ఆర్ఆర్, దంగల్ మూవీల తర్వాత ఎక్కువ దేశాల్లో విడుదలైన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. ఈ మూవీలో అదా శర్మ.. శాలిని ఉన్నికృష్ణన్.. ఫాతిమాగా ఎలా మారిందనే విషయాన్ని చూపించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 330 కోట్లకు పైగా వసూళ్లన సాధించి ఔరా అనిపించింది. మొత్తంగా గతేడాది సంచలనం రేపిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి సంచలనాకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుందో చూడాలి.

ఇదీ చదవండి: Ruchaka Rajyog 2024: రుచకరాజ్యయోగం ఈరాశికి ప్రత్యేకం.. మార్చిలోగా కొత్త ఉద్యోగం, కాసులవర్షం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News