Will Smith in Oscars 2022: ఆస్కార్​ వేడుకల్లో విల్​ స్మిత్ ప్రవర్తనపై అకాడమి స్పందన!

Will Smith in Oscars 2022: ఆస్కార్​ అవార్డుల ప్రదానోత్సవ వేడుకలో విల్​ స్మిత్​, క్రిస్​రాక్​ మధ్య జరిగిన ఘటనపై అకాడమి స్పందించింది. హింస ఏ మార్గంలో జరిగినా సహించేదిలేదని స్పష్టం చేసింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 28, 2022, 07:49 PM IST
  • ఆస్కార్ వేడుకల్లో అనూహ్య పరిణామం
  • స్టేజ్​పైనే కమేడియన్​ను కొట్టిన విల్​ స్మిత్​
  • ఘటనపై స్పందించిన అకాడమి
Will Smith in Oscars 2022: ఆస్కార్​ వేడుకల్లో విల్​ స్మిత్ ప్రవర్తనపై అకాడమి స్పందన!

Will Smith in Oscars 2022: ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సంలో విల్​ స్మీత్​.. స్టేజ్​పైనే క్రిస్​ రాక్​ చెంప చెల్లుమనిపించిన ఘటనపై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటనపై పెద్ద ఎత్తున దుమారం రేగుతున్న నేపథ్యంలో 'ది అకాడమి ఆఫ్​ మోషన్​ పిక్చర్​ ఆర్ట్స్ అండ్ సైన్స్​ (ఏఎంపీఏఎస్​)' స్పందించింది.

'ఏ విధమైన హింసను అకాడమీ సహించదు. ఈ రాత్రి 94వ అవార్డుల వేడుక జరుపుకుంది. సహచరులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికుల నుంచి గుర్తింపు పొందటం మంచి విషయం' అని చెప్పుకొచ్చింది. అయితే విల్​ స్మిత్ అలా ప్రవర్తించడంపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందని అనే విషయంపై మాత్రం అకాడమీ స్పష్టతనివ్వలేదు.

ఇంతకీ విల్​ స్మీత్ ఎందుకలా చేశాడు?

94వ ఆస్కార్ వేడుకల్లో విల్​ స్మిత్ ఉత్తమ నటుడిగా.. ఆస్కార్ గెలుపొందారు. ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంలో స్టేజ్​పై హాలీవుడ్​ కమేడియన్ క్రిస్​ రాక్​ మాట్లాడుతూ.. విల్​ స్మీత్​ భార్యపై జోకు వేశారు. దీనితో అది నచ్చని విల్​ స్మిత్ స్టేజ్​పైకి ఎక్కి.. క్రిస్​ రాక్​ చెంప చెల్లుమనిపించారు. ఆ తర్వాత ఒక్క క్షణం మౌనంగా ఉన్న క్రిస్​ రాక్​ తిరిగి మాటల్లో మునిగిపోయాడు. విల్​ స్మిత్​తో స్టేజ్​పై నుంచే మాట్లాడే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ.. విల్ స్మీత్​ స్టేజ్​ కింద నుంచి కూడా క్రిస్​ రాక్ మాటలకు కోపంగానే సమాధానిమచ్చారు.

అయితే ఆ తర్వాత విల్​ స్మిత్​ క్రిస్​ రాక్​కు, అకాడమికీ క్షమాపణలు కూడా చెప్పారు.

ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో సమాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వైరల్ అవుతోంది. విల్​ స్మిత్ అలా చేయకుండా ఉండాల్సిందని కొందరు కామెంట్స్ చేస్తుంటగా.. విల్​ స్మిత్ మంచి పని చేశాడండూ పలువురు సపోర్ట్ చేస్తున్నారు.

Also read: Radhe Shyam OTT: 'రాధేశ్యామ్‌' ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది.. అమెజాన్‌ ప్రైం వీడియోస్‌లో స్ట్రీమింగ్‌!

Also read: Krishna Vrinda Vihari: 'కృష్ణ వ్రి౦ద విహారి' సినిమా టీజర్ విడుదల.. ఎలా ఉందంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News