Tiger Nageshwara Rao: రవితేజ 'టైగర్‌ నాగేశ్వరరావు' ఫస్ట్‌ సాంగ్ ప్రోమో వచ్చేసింది..!

Tiger Nageshwara Rao: మాస్ మహరాజా రవితేజ నయా మూవీ 'టైగర్‌ నాగేశ్వరరావు'. ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ ఫేం వంశీకృష్ణ ద‌ర్శక‌త్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకా రానుంది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 4, 2023, 02:22 PM IST
Tiger Nageshwara Rao: రవితేజ 'టైగర్‌ నాగేశ్వరరావు' ఫస్ట్‌ సాంగ్ ప్రోమో వచ్చేసింది..!

Tiger Nageshwara Rao First Single Promo Out: మాస్ మహరాజా రవితేజ లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు'(Tiger Nageshwara Rao). వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ అగ‌ర్వాల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. రేణుదేశాయ్‌ కీలకపాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటుంది. ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కబోతుంది. 

తాజాగా ఈ మూవీ నుండి  ఫస్ట్‌ సింగిల్‌ ప్రోమోను(Tiger Nageshwara Rao First Single Promo) రిలీజ్ చేశారు మేకర్స్. ''ఏక్‌ ధమ్‌ ఏక్ ధమ్‌...'' అంటూ సాగే మెలోడియస్‌ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. పుల్ లిరికల్ సాంగ్ ను మంగళవారం రిలీజ్ చేయనున్నారు మేకర్స్.  ఈ సినిమా సెప్టెంబరు 28న రిలీజ్ అవుతుందని ప్రకటించినా.. ఆరోజున ఖచ్చితంగా వస్తుందన్న సంకేతాలైతే లేవని టాక్ వినిపిస్తోంది. 70, 80 ద‌శ‌కాల్లో నాగేశ్వర‌రావు అనే గజదొంగ ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఎత్తున దొంగ‌త‌నాలు, దోపిడీలకు పాల్పడి పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరిగేవాడు. గ‌జ‌దొంగ క‌థ బ‌యోపిక్‌గా తెరకెక్కడంతో ఆడియెన్స్ లో ఆసక్తి పెరిగింది. ఈ మూవీ తర్వాత రవితేజ 'ఈగల్' అనే చిత్రంలో నటించనున్నాడు. 

Also Read: Kushi Collections: రూ.50 కోట్ల క్లబ్ లో 'ఖుషి'.. కేవలం రెండు రోజుల్లోనే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News