ప్రభాస్ ను టచ్ చేయలేకపోయిన సల్మాన్

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ సినిమా 'టైగర్ జిందా హై' శుక్రవారం డిసెంబర్ 22వ తేదీ థియేటర్లలో విడుదల అయ్యింది. ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. 

Last Updated : Dec 23, 2017, 12:35 PM IST
ప్రభాస్ ను టచ్ చేయలేకపోయిన సల్మాన్

న్యూఢిల్లీ: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ సినిమా 'టైగర్ జిందా హై' శుక్రవారం డిసెంబర్ 22వ తేదీ థియేటర్లలో విడుదల అయ్యింది. ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. సుదీర్ఘకాలం తర్వాత ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ కలిసి నటించారు. ఈ సినిమా దర్శకుడు అలీ అబ్బాస్ జఫర్.

ఈ చిత్రం ప్రజలు ఆశించినట్లు ఉంది. అవును, 'ట్యూబ్ లైట్' సినిమాతో నిరుత్సాహా పరిచిన సల్మాన్.. కొత్త చిత్రం 'టైగర్ జిందా హై' తో ప్రేక్షకులను అలరించారు. మొదటివారంలో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.   మీడియా నివేదికల ప్రకారం, ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు రూ.35-40 కోట్ల మధ్య ఉంటుందని అంచనా.

ఇదే జరిగినట్లయితే, బాక్సాఫీస్ వద్ద రిలీజైన మొదటిరోజే అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ చిత్రం (మొదటి చిత్రం బాహుబలి2 ) 'టైగర్ జిందా హై' అవుతుంది. తరువాతి స్థానాల్లో అజయ్ దేవగన్ 'గోల్ మాల్', అమీర్ ఖాన్ 'దంగల్', షారుఖ్ ఖాన్  'రయిస్' ఉంది.   

బాహుబలి 2- 40.75 కోట్లు
గోల్మాల్ అగైన్- 30.14 కోట్లు
దంగల్- 29.78 కోట్లు
ట్యూబ్ లైట్ - 21.15 కోట్లు
రయిస్- 20.42 కోట్లు
జాద్వా 2-16.10 కోట్లు
జబ్ హ్యారీ మాట్ సెజల్- 15.25 కోట్లు
జాలీ ఎల్ఎల్బి2 - 13.20 కోట్లు
టాయిలెట్ ఏ వప్రేమ్ కథ- 13.10 కోట్లు
బద్రీనాథ్ కీ దుల్హనియా ఆలియా భట్- 12.25 కోట్లు

ఈ చిత్రం 2012లో సల్మాన్ ఖాన్ నటించిన "ఏక్ థా టైగర్" కి సీక్వెల్. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ ఇద్దరూ 'టైగర్ జిందా హై' చిత్రంలో గొప్పగా నటించారు. ఈ చిత్రంలో, సల్మాన్ ఖాన్ మంచు కొండలలో కొన్ని తోడేళ్ళతో పోరాడటానికి వెళ్తాడు. ఈ సినిమాను  మొరాకో, గ్రీస్ వంటి అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించారు. అక్కడి అందమైన లొకేషన్లు ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. ఈ అందమైం లొకేషన్లలో ప్రేక్షకులు చాలా సంవత్సరాల తరువాత సల్మాన్, కత్రినా మధ్య రొమాన్స్ సన్నివేశాలను చూడవచ్చు. 

Trending News