Leonardo DiCaprio: ఉక్రెయిన్​కు టైటానిక్ హీరో రూ.77 కోట్లు విరాళం

Leonardo DiCaprio news: రష్యా దాడిలో దెబ్బతిన్న ఉక్రెయిన్​కు హాలీవుడ్ స్టార్ లియోనార్డో డికాప్రియో తన వంతు సాయం చేశారు. 10 మిలియన్​ డాలర్లు(రూ.77 కోట్లు) విరాళంగా అందించారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 8, 2022, 06:57 PM IST
Leonardo DiCaprio: ఉక్రెయిన్​కు టైటానిక్ హీరో రూ.77 కోట్లు విరాళం

Leonardo DiCaprio news: రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్‌కు (Ukraine) తన వంతు సాయంగా.. టైటానిక్ హీరో లియోనార్డో డికాప్రియో(Leonardo DiCaprio) 10 మిలియన్ డాలర్లను (రూ.77కోట్లు) విరాళంగా ఇచ్చారు. ఉక్రెయిన్‌కు ఈ హాలీవుడ్ హీరో ఇంత విరాళం ప్రకటించడానికి వ్యక్తిగత కారణం కూడాఉంది. ఆయన అమ్మమ్మ  హెలెన్ ఇండెన్‌బిర్కెన్ (Helene Indenbirken) ఉక్రెయిన్‌లోని ఒడెస్సాలో జన్మించారు. అయితే 1917లో ఆమె తన తల్లిదండ్రులతో కలిసి జర్మనీకి వలస వెళ్లింది. అక్కడే డికాప్రియో తల్లి పుట్టారు. ఆయనకు అమ్మమ్మతో మంచి సాన్నిహిత్యం ఉంది. డికాప్రియో నటించిన ప్రతి సినిమా ప్రీమియర్​కు ఆమె హాజరయ్యేవారు. 93 ఏళ్ల వయసులో హెలెన్ 2008లో ఆమె మరణించారు. 

డికాప్రియో ఇప్పటివరకు ఆరు సార్లు ఆస్కార్​కు నామినేట్ అయ్యారు. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ వ్యవహారిస్తున్నారు. అలెజాండ్రో గొంజాలెజ్ ఇనారిట్ తెరకెక్కించిన 'రెవెనెంట్'లో నటనకు గానూ 2016లో ఆస్కార్ గెలుచుకున్నారు. 1998లో, 25 ఏళ్ల వయసులోనే  ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి 'లియోనార్డో డికాప్రియో ఫౌండేషన్​'ను స్థాపించాడు. 'యాక్టర్ అండ్ ఎకాలజిస్ట్'​ అనే వ్యాసాన్ని చాలా ఏళ్లుగా రాస్తున్నారు డికాప్రియో. వాతావరణ విపత్తులపై పోరులో తన వంతు సాయం అందిస్తున్నారు. 

Also Read: Russia Ukraine War: రాత్రికి రాత్రే ఉక్రెయిన్‌లో రష్యా పెను విధ్వంసం.. 500 కిలోల బాంబులతో దాడులు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News