Red movie: సంక్రాంతి బరిలోనే రామ్ సినిమా

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ( Ram Pothineni ) తదుపరి యాక్షన్ థ్రిల్లర్ 'రెడ్' సినిమాని కిషోర్ తిరుమల ( Director Kishore Tirumala ) డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ స్రవంతి మూవీస్ ఆధ్వర్యంలో స్రవంతి రవి కిషోర్, కృష్ణ చైతన్య కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Last Updated : Oct 25, 2020, 12:08 PM IST
Red movie: సంక్రాంతి బరిలోనే రామ్ సినిమా

Ram’s Red movie release on Sankranthi 2021: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ( Ram Pothineni ) తదుపరి యాక్షన్ థ్రిల్లర్ 'రెడ్' సినిమాని కిషోర్ తిరుమల ( Director Kishore Tirumala ) డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ స్రవంతి మూవీస్ ఆధ్వర్యంలో స్రవంతి రవి కిషోర్, కృష్ణ చైతన్య కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 'తడమ్' అనే తమిళ చిత్రానికి రీమేకే ఈ రెడ్ సినిమా ( Tadam Telugu remake ). ఈ చిత్రంలో రామ్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడు. వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్‌ 9న విడుదల చేయాలని మూవీ మేకర్స్ నిర్ణయించారు. కానీ కరోనా కారణంగా నిలిచిపోయింది. ఆ తర్వాత ప్రభుత్వం ప్రకటించిన కోవిడ్ నిబంధనల మధ్య ఓటీటీ ద్వారా విడుదలవుతుందని టాక్ వచ్చింది. అప్పుడు స్పందించిన చిత్ర బృందం 'రెడ్‌' సినిమాని థియేటర్లలో మాత్రమే విడుదల చేస్తామని ప్రకటించింది. Also read: Dussehra 2020: శమీ పూజ.. పాలపిట్ట దర్శనం ప్రాముఖ్యత గురించి మీకు తెలుసా..?

అయితే ఈరోజు దసరా (dussehra) పర్వదినం సందర్భంగా ఈ సినిమా రిలీజ్‌పై క్లారిటీ వచ్చింది. ఈ మేరకు హీరో రామ్ పోతినేని ఆదివారం ట్విట్ చేసి వెల్లడించాడు. అంతకుముందు విడుదలైన హిట్ సినిమాలు.. 'దేవదాస్‌, మస్కా' చిత్రాల మాదిరిగానే.. రెడ్ (RED) సినిమా కూడా  సంక్రాంతికి థియేటర్లల్లో  ( Red movie releasing date ) విడుదలవుతుందని ప్రకటించాడు. అంటే వచ్చే సంక్రాంతి ( Sankranti 2021) కి రామ్ సినిమా కూడా పెద్ద సినిమాల బరిలో నిలవనుంది. ఇదిలాఉంటే.. రామ్‌ పోతినేని తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్న రెడ్ సినిమాలో రామ్ సరసన నివేదా పెతురాజ్, మాల్వికా శర్మ, అమృత అయ్యర్‌ నటిస్తున్నారు.  

Also read: Dussehra 2020: శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారి దర్శనం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News