Raviteja Movie: మాస్ మహారాజా నటించిన తాజా చిత్రం టైగర్ నాగేశ్వరరావు గురించి బిగ్ అప్‌డేట్ ఇది. ఏ మాత్రం ప్రచారం లేకుండా హఠాత్తుగా ఓటీటీలోకి వచ్చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఇంత హఠాత్తుగా స్ట్రీమింగ్ కావడం అంతుబట్టకుండా ఉంది.
ఇటీవలి కాలంలో ఓటీటీలకు క్రేజ్ బాగా పెరిగింది. నచ్చిన కంటెంట్, నచ్చిన భాషలో, నచ్చిన సమయంలో, నచ్చిన చోటు లేదా ఇంట్లో ఎంజాయ్ చేస్తూ చూసే అవకాశముండటంతో ఓటీటీకు ఆదరణ పెరుగుతోంది. దీనికితోడు వివిధ రకాల వెబ్‌సిరీస్‌లు ఇంకా మంచి వినోదాన్ని అందిస్తున్నాయి. అందుకే ప్రతి కొత్త సినిమా థియేటర్ రిలీజ్ డేట్‌తో పాటు ఓటీటీ హక్కులు, ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగానే మాస్ మహారాజా నటించిన తాజా చిత్రం టైగర్ నాగేశ్వరరావు ఓటీటీ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ సొంంతం చేసుకుంది.
అంతవరకూ బాగానే ఉంది..కానీ స్ట్రీమింగ్ డేట్ విషయంలో సాధారణంగా ఓటీటీలు ప్రచారం చేసుకుంటాయి. లేదా సినిమా నిర్మాతలు ప్రచారం చేస్తారు. కానీ ఏ మాత్రం చడీచప్పుడు లేకుండా హఠాత్తుగా అమెజాన్ ప్రైమ్‌లో టైగర్ నాగేశ్వరరావు చిత్రం నిన్న రాత్రి నుంచి స్ట్రీమింగ్ ప్రారంభమై అందర్నీ ఆశ్చర్యపర్చింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో టైగర్ నాగేశ్వరరావు సినిమా అందుబాటులో ఉందని అమెజాన్ ప్రైమ్ తెలిపింది.
దసరా కానుకగా అక్టోబర్ 20న భారీ అంచనాలతో విడుదలైన టైగర్ నాగేశ్వరరావు సినిమా నిజ జీవిత గాధ ఆధారంగా తెరకెక్కింది. రవితేజ కెరీర్‌లో తొలి బయోపిక్ ఇది. పాన్ ఇండియా మార్కెట్‌లో మొదటి సినిమా కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి. కానీ కథనం, కథలో ఆసక్తి లేకపోవడం వల్లనుకుంటా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. తెలుగులో యావరేజ్ అయినా మిగిలిన భాషల్లో డిజాస్టర్‌గా నిలిచింది. రవితేజ సరస నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ హీరోయిన్లుగా నటించారు. 70-80 దశకంలో తెలుగు రాష్ట్రాల్ని గజగజలాడించిన స్టూవర్ట్‌పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.
Also read: Sreeleela: బ్లాక్‌డ్రెస్‌లో శ్రీలీల మెరుపులు.. చూపులతో కుర్రకారుకు వల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook