Jhansi Webseries: వెండి తెర నుంచి వెబ్ తెరకు, అంజలి ఝాన్సీ వెబ్‌సిరీస్ అక్టోబర్ 27 నుంచి స్ట్రీమింగ్

Jhansi Webseries: టాలీవుడ్ నటి అంజలి వెండితెర నుంచి వెబ్ తెరకు మారింది. అంజలి నటించిన ఝాన్సీ వెబ్ సిరీస్ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఝాన్సీ వెబ్‌సిరీస్ కథనం ఇలా ఉండనుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 16, 2022, 05:51 PM IST
Jhansi Webseries: వెండి తెర నుంచి వెబ్ తెరకు, అంజలి ఝాన్సీ వెబ్‌సిరీస్ అక్టోబర్ 27 నుంచి స్ట్రీమింగ్

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వెంకటేశ్ సరసన సీతగా అలరించడమే కాకుండా అందర్నీ ఆకట్టుకుంది అంజలి. ఆ తరువాత సరైన హిట్స్ లేకపోయినా..టాలీవుడ్ ప్రముఖ నటిమణుల జాబితాలో చేరింది. ఇప్పుడు బ్రేక్ తరువాత తిరిగి ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈసారి వెండితెరపై కాకుండా వెబ్ తెరపై అలరించనుంది. 

అంజలి ప్రధానపాత్రలో తెరకెక్కిన కొత్త వెబ్ సిరీస్ ఝాన్సీ. దర్శకుడు తిరు తెరకెక్కించిన ఈ వెబ్‌సిరీస్ అక్టోబర్ 27 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో అంజలితో పాటు ముమైత్ ఖాన్, కళ్యాణ్ మాస్టర్, రాజ్ అర్జున్, చాందినీ చౌదరి, సంయుక్త హార్నాడ్ తదితరులు కన్పించనున్నారు. సైకలాజికల్ యాక్షన్ డ్రామా నేపధ్యంలో ఝాన్సీ వెబ్‌సిరీస్ తెరకెక్కింది. ఇందులో అంజలి యాక్షన్ ఓరియెంటెడ్ పాత్రలో ఆకట్టుకోనుంది. 

ఇప్పటికే విడుదలైన ఝాన్సీ ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. నా శత్రువులు ఎవరో నాకు తెలియాలనే డైలాగ్ అందర్నీ ఆలోచింపజేస్తోంది. తన గతమేంటో తెలుసుకునేందుకు శ్రమించే పాత్ర అంజలిది. ద ఫ్యామిలీ మ్యాన్ వెబ్‌సిరీస్ స్టంట్ కొరియోగ్రాఫర్ యనిక్ బెన్ ఇందులో అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చేశారు. 

Also read: Malavika Mohanan Pics: పొట్టి డ్రెస్సులో మాళవిక మోహనన్.. నెవర్ బిఫోర్ అనేలా మలయాళ బ్యూటీ గ్లామర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News