Tollywood drugs case, ED enquiries Rana: రానాపై ఈడీ ప్రశ్నల వర్షం.. ఎఫ్‌ క్లబ్‌ వ్యవహారాలపై కూపీ.. గంటల తరబడి విచారణ

Tollywood drug case : మనీలాండరింగ్‌, ఫెమా యాక్ట్ నిబంధనల ఉల్లంఘనలో రానాను అధికారులను ప్రశ్నించారు. రానాకు సంబంధించిన విదేశీ టూర్లు, మనీ ట్రాన్సాక్షన్స్‌పై ఈడీ  అధికారులు కూపీ లాగుతున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 8, 2021, 03:03 PM IST
  • టాలీవుడ్‌ మాదకద్రవ్యాల కేసులో ఈడీ ఎదుట హాజరైన రానా
  • మనీలాండరింగ్‌, ఫెమా యాక్ట్ నిబంధనల ఉల్లంఘనలో ప్రశ్నించిన అధికారులు
  • రేపు ఈడీ విచారణకు హాజరుకానున్న రవితేజ
Tollywood drugs case, ED enquiries Rana: రానాపై ఈడీ ప్రశ్నల వర్షం.. ఎఫ్‌ క్లబ్‌ వ్యవహారాలపై కూపీ..  గంటల తరబడి విచారణ

Tollywood drug case: టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోన్న మాదకద్రవ్యాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) (ED) పలువురు సినీ ప్రముఖులను విచారిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా డ్రగ్స్ (drugs) విక్రేత కెల్విన్‌తో పాటు (kelvin) సినీ ప్రముఖులు పూరీ జగన్నాథ్, (Puri Jagannadh) ఛార్మి, (charmi) రకుల్‌, నందులను విచారించిన అధికారులు వారి నుంచి కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. విచారణలో భాగంగా బుధవారం ఉదయం హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati) ఈడీ ఎదుట  హాజరయ్యారు. గంటల తరబడి ఈడీ అధికారులు రానాను విచారిస్తున్నారు.

మనీలాండరింగ్‌, ఫెమా యాక్ట్ నిబంధనల ఉల్లంఘనలో రానాను అధికారులను ప్రశ్నించారు. రానాకు సంబంధించిన విదేశీ టూర్లు, మనీ ట్రాన్సాక్షన్స్‌పై ఈడీ అధికారులు కూపీ లాగుతున్నారు. ఎఫ్ క్లబ్ (f club) వ్యవహారాల్లో నవదీప్, రకుల్‌ప్రీత్‌సింగ్‌తో ఉన్న సంబంధాలపై ఈడీ ఆరా తీసినట్లు తెలుస్తోంది.

Also Read : RC15 launch: రామ్‌చరణ్‌ ఆర్‌సీ 15 షురూ.. క్లాప్‌ కొట్టిన మెగాస్టార్

గంటల తరబడి ఈడీ విచారణ

బ్యాంకు ఖాతాలతో పాటు కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను రానా (Rana) తన వెంట తీసుకెళ్లారు. తన  ఆడిటర్స్‌, అడ్వకేట్స్‌తో కలిసి ఆయన ఈడీ కార్యాలయానికి వెళ్లారు. అయితే గతంలో 2017 జరిపిన ఎక్సైజ్‌ విచారణలో రానా, రకుల్‌ల పేర్లు లేవు. కాగా డ్రగ్స్‌ పెడ్లర్‌ కెల్విన్‌ ఇచ్చిన సమాచారంతోనే వీరిద్దరికీ నోటీసులు ఇచ్చారు అధికారులు. మనీ లాండరింగ్‌ కోణంలో రానా బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలించారని సమాచారం. అలాగే అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. రానా నుంచి చాలా విషయాలు రాబట్టేందుకే గంటల తరబడి ఈడీ అధికారులు విచారిస్తున్నారు. కాగా రేపు హీరో రవితేజ ఈడీ విచారణకు హాజరుకానున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News