Samantha: ఉత్తరాది భామల్ని మనం అందలమెక్కిస్తున్నా..మన నటీమణుల్ని మాత్రం ఉత్తరాది దూరం పెడుతుంటుంది. ముఖ్యంగా వివక్ష చూపిస్తుంటుంది. సమంత విషయంలో అదే జరిగిందా..
దక్షిణాదిన ఎంత క్రేజ్ సంపాదించినా..ఎంతగా అగ్రస్థానంలో నిలిచినా ఉత్తరాదిన మాత్రం ఇక్కడి నటులంటే వివక్షే అనేది మరోసారి రుజువైంది. బాలీవుడ్‌పై ఆసక్తితో అక్కడికెళ్లిన దక్షిణాది భామలకు ప్రతిసారీ చేదు అనుభవమే ఎదురైంది. అవకాశాలు లభించినా ప్రాధాన్యత లేని పాత్రలు, సెకండ్ హీరోయిన్ అవకాశాలివ్వడం జరిగేది. ఇప్పుడు దక్షిణాదితో పాటు పాన్ ఇండియా సినిమా, వెబ్‌సిరీస్‌తో క్రేజ్ సాధించిన సమంత ప్రభుకు కూడా అదే పరిస్థితి ఎదురైంది.
వాస్తవానికి సమంతకు ఉత్తరాదిన ది ఫ్యామిలీ మ్యాన్ 2తో విపరీతమైన క్రేజ్ వచ్చింది. పుష్ప సినిమాలో ఊ అంటావా పాటతో ఆ క్రేజ్ మరింతగా పెరిగింది. ఈ నేపధ్యంలో సమంతకు భారీ ఆఫర్లు వస్తున్నా తిరస్కరిస్తూ వచ్చింది. క్రేజ్ ఉన్నప్పుడు ఆఫర్లను ఎందుకు తిరస్కరిస్తుందనేది అభిమానులకు అర్ధం కాలేదు. మంచి మంచి ఆఫర్లను సమంత ఎందుకు తిరస్కరిస్తుందని ప్రశ్నించుకునేవారు. అయితే అసలు విషయం కాస్తా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సమంతకు ఇచ్చిన ఆఫర్ల విషయంలో కూడా ఉత్తరాది వివక్ష పాటించిందని తెలిసింది. దక్షిణాదిన అంత క్రేజ్ ఉన్న సమంతకు..సెకండ్ హీరోయిన్ పాత్రలే ఆఫర్ చేశారట. అందుకే సమంత ఆ ఆఫర్లను తిరస్కరించిందని తెలిసింది.
Also read: Imran-Avanthika: మొన్న చైతూ-సామ్ జంట..ఇప్పుడు ఇమ్రాన్-అవంతికలు..త్వరలో విడాకులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook