Tollywood Choreographer Rakesh Master Sudden Death: టాలీవుడ్‌కు తీరని శోకం మిగిలింది. ప్రముఖ నృత్య దర్శకుడు రామారావు అలియాస్ రాకేష్ మాస్టర్ కాస్సేపటి క్రితం హఠాన్మరణం చెందారు. వడదెబ్బ కారణంగా ఒక్కసారిగా ఆరోగ్యం విషమించి ప్రాణాలు పోయినట్టుగా తెలుస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోలందరికీ కొరియోగ్రఫీ చేసిన ఘనత రాకేష్ మాస్టర్ సొంతం.
ప్రముఖ కొరియో గ్రాఫర్ రాకేశ్ మాస్టర్ కాస్సేపటి క్రితం మృతి చెందారు. విజయనగరం నుంచి వస్తుండగా సన్‌స్ట్రోక్ తగిలినట్టు తెలుస్తోంది. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రాకేశ్ మాస్టర్ మరణవార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆట డ్యాన్స్ షోతో రాకేష్ మాస్టర్ కెరీర్ ప్రారంభమైంది. ఇప్పటి వరకూ 1500 సినిమాలకు కొరియోగ్రఫీ చేసిన రాకేష్ మాస్టర్ గత కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉండి యూట్యూబ్ ఇంటర్వ్యూలతో హల్‌చల్ చేస్తున్నారు.
రాకేష్ మాస్టర్ సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఇంటర్వ్యూలతో యాక్టివ్‌గా ఉంటున్నారు. తన కెరీర్‌ను చాలామంది డ్యాన్స్ మాస్టర్లు నాశనం చేశారని చెబుతూ వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనమయ్యారు. యూట్యూబ్ ఇంటర్వ్యూల్లో ఆట షో గురించి, డ్యాన్స్ షో గురించి ఇష్టమొచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తుండటంతో మతి స్థిమితం కోల్పోయిందనే పుకార్లు కూడా వ్యాపించాయి. రాకేష్ మాస్టర్ మరణవార్త విని సినీ పరిశ్రమలోని ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో నెంబర్ వన్ కొరియోగ్రాఫర్లుగా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఇద్దరూ రాకేష్ మాస్టర్ శిష్యులే కావడం విశేషం. రెండు నెలల క్రితం వాంతులు, విరేచనాలతో ఆరోగ్యం విషమించినప్పుడే వైద్యులు ఎక్కువ కాలం బతకడం కష్టమని చెప్పినట్టు తెలుస్తోంది.
చలనచిత్ర పరిశ్రమలో కొత్తరక్తం రావడంతో పాతవారికి సహజంగానే అవకాశాలు తగ్గిపోతాయి. ఈ క్రమంలో రాకేష్ మాస్టర్‌కు అవకాశాలు తగ్గిపోవడంతో ఆయనలో ఓ విధమైన నిరాశ ఆవహించింది. యూట్యూబ్ జీవనాధారం చేసుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ క్రేజీ వీడియోస్ చేస్తూ యూట్యూబర్‌గా స్థిరపడ్డారు. విజయనగరం కార్యక్రమంలో పాల్గొని వస్తుండగా వడదెబ్బ తగలడంతో ఒక్కసారిగా ఆరోగ్యం క్షీణించింది. వాంతులు, విరేచనాలు అవడంతో తక్షణం విశాఖపట్నం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.
Also Read: Salaar Movie: అదిపురుష్ ముగిసింది, ఇక ఆశలన్నీ సలార్‌పైనే, ఆగస్టు 15నే టీజర్ విడుదల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి