Two Souls Movie Review And Rating ఆత్మలు శరీరం నుంచి బయటకు వచ్చి ప్రయాణం చేయడమనే కాన్సెప్ట్ మనం ఇది వరకే చూశాం. అయితే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఆధారంగా టూ సోల్స్ అనే సినిమా వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమా కథ, కథనాలు ఏంటి? ఈ సినిమా ఆడియెన్స్‌ను ఎలా మెప్పిస్తుంది? అనేది ఓ సారి చూద్దాం.
కథ
అఖిల్ (త్రినాథ్ వర్మ) తన తండ్రికి దూరంగా ఒంటరిగా జీవితాన్ని గడుపుతుంటాడు. తండ్రి సంపాదించిన ఆస్థిని కూడా అనుభవించడు. సొంతంగా బతకాలని చూస్తుంటాడు. అఖిల్ జీవితంలోకి ప్రియ అనే అమ్మాయి వస్తుంది. ప్రేమిస్తున్న విషయాన్ని మాత్రం ఆమెకు చెప్పడు. ఒకసారి నేరుగా పెళ్లి ప్రపోజల్ పెట్టేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలోనే ఆమె ఇంకో వ్యక్తితో క్లోజ్‌గా ఉంటుంది. అది భరించలేని అఖిల్ తన ప్రాణాలను తాను తీసుకోవాలని అనుకుంటాడు. ఈ క్రమంలో ప్రమాదం జరిగి హాస్పిటల్ బెడ్డు మీదకు వస్తాడు అఖిల్. ఆ తరువాత అతని ఆత్మ బయటకు వస్తుంది. అదే సమయంలో ప్రియ అనే మరో అమ్మాయి ఆత్మ కూడా బయటకు వస్తుంది. ఆ తరువాత ఈ రెండు ఆత్మలు చేసిన ప్రయాణం ఏంటి? అసలు రెండు ఆత్మలకు ఉన్న రిలేషన్ ఏంటి? ఈ కథలో రూప, ప్రియలు ఎవరు? చివరకు అఖిల్ ఏం చేశాడు? ప్రేమ కథలో వచ్చిన ట్విస్ట్‌లు ఏంటి? అన్నది మిగతా కథ.
నటీనటులు
టూ సోల్స్ అనే ఈ సినిమాలో ప్రధానంగా సినిమా అంతా కూడా త్రినాథ్ వర్మ, భావన మధ్య సాగుతుంది. త్రినాథ్ అన్ని రకాల ఎమోషన్స్‌ను పండించాడు. ఎమోషనల్ సీన్స్‌లో మెప్పించాడు. ఇక భావన అయితే అందరినీ నవ్విస్తుంది.. ఏడ్పిస్తుంది.. నటనతో ఆకట్టుకుంటుంది. ఇక హీరో ఫ్రెండ్ పాత్రలో రవితేజ, హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో మౌనిక రెడ్డి వంటి వారు కూడా మెప్పిస్తారు. మిగిలిన వారంతా తమ పరిధి మేరకు ఆకట్టుకుంటారు.
విశ్లేషణ
రెండు ఆత్మల మధ్య ప్రేమ ప్రయాణం అనే కాన్సెప్ట్‌ను తీసుకుని, దానికి చక్కటి నేపథ్యాన్ని ఎంచుకోవడంతో దర్శకుడిగా శ్రవణ్ సక్సెస్ అయినట్టు అనిపిస్తుంది. సినిమాలోని ఫీల్‌కు తగ్గట్టుగా ఎంచుకున్న సిక్కిం బ్యాక్ డ్రాప్, ఆ విజువల్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. పాత్రల్లోని ఎమోషన్స్‌ను, మూడ్‌ను తెరపై తీసుకు రావడంతో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. దర్శకుడిగా మొదటి సినిమానే అయినా కూడా ప్రేక్షకులను ఎమోషనల్‌గా కనెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు.
ఇక ప్రథమార్థం కాస్త స్లోగా సాగినట్టు అనిపిస్తుంది. అసలు తెరపై ఏం జరుగుతుందనే కన్ఫ్యూజన్ ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే ద్వితీయార్థం మాత్రం మరింత ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది. ప్రధాన పాత్రల మధ్య ప్రేమను ఎస్టాబ్లిష్ చేసే సీన్లు, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ అందరినీ కదిలిస్తాయి. చివర్లో వచ్చే ట్విస్ట్ బాగుంటుంది. కానీ ప్రేక్షకుడు దాన్ని ముందే పసిగట్టే అవకాశం కూడా ఉంది.
Also Read: Malli Pelli Teaser : మళ్లీ పెళ్లి టీజర్.. నరేష్-రమ్య రఘుపతి-పవిత్రల కథే సినిమానా?.. హోటల్ సీన్ కేక
ఇక సాంకేతికంగా సినిమా మెప్పిస్తుంది. శశాంక్ సాయి రామ్ అందించిన విజువల్స్, చూపించిన కెమెరాపనితనం బాగుంది. ప్రతీక్ అందించిన బాణీలు ఆహ్లాదకరంగా అనిపిస్తాయి. ఆనంద్ నంబియార్ నేపథ్య సంగీతం మూడ్‌కు తగ్గట్టుగా వెళ్తుంది. ప్రేమంటే.. ఒకరు మాత్రమే ప్రేమిస్తే సరిపోదు, మనం ఎవరో తెలియాలంటే.. చుట్టు పక్కలా చూడటం కాదు..వెనక్కి చూస్తే తెలుస్తుంది.. అంటూ రైటర్‌గా శ్రవణ్ రాసిన కొన్ని మాటలు మెప్పిస్తాయి. డైరెక్టర్, రైటర్, ఎడిటర్‌గా శ్రవణ్ ఆకట్టుకుంటాడు. విజయ లక్ష్మీ నిర్మాతగా ఈ సినిమాను ఎంతో ప్యాషన్‌తో నిర్మించినట్టు కనిపిస్తుంది. నిర్మాణ విలువలు గొప్పగా అనిపిస్తాయి.
రేటింగ్ 2.75
Also Read: Asha Negi Photos : బెడ్డుపై నగ్నంగా బుల్లితెర నటి.. ఆశలు రేపేలా ఆశా నేగి పోజులు.. పిక్స్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook