Twist in Bigg Boss 6: ఇనయా కాదు.. చివరి నిముషంలో బయటకి నేహా., ఎందుకంటే?

Twist in Bigg Boss 6: Neha Chowdary Eliminated in third Week: బిగ్ బాస్ లీక్స్ ప్రకారం షో నుంచి నేహ చౌదరి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 25, 2022, 04:21 PM IST
Twist in Bigg Boss 6: ఇనయా కాదు.. చివరి నిముషంలో బయటకి నేహా., ఎందుకంటే?

Twist in Bigg Boss 6: Neha Chowdary Eliminated in third Week:ఎంతో ఆసక్తికరంగా సాగుతున్న బిగ్ బాస్ సీజన్ 6 ఇప్పుడు మూడో వారం ఆఖరికి చేరింది. ఆదివారం నాడు ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారు అన్న సంగతి తెలిసిందే. అయితే ఆదివారానికి సంబంధించిన షూట్ కూడా శనివారం పూర్తి చేస్తారని సంగతి కూడా దాదాపుగా బిగ్ బాస్ ఫాలో అయ్యే వారందరికీ తెలుసు. అయితే శనివారం నాడు జరిగిన షూట్ ప్రకారం ముందుగా ఇనయ సుల్తానా ఎలిమినేటి అయిందని ప్రచారం జరిగింది. ఓటింగ్ లో అందరికంటే తక్కువ ఓటింగ్ శాతం రావడంతో ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరిగింది.

కానీ బిగ్ బాస్ లీక్స్ ప్రకారం షో నుంచి నేహ చౌదరి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. స్పోర్ట్స్ యాంకర్ గా నేహా చౌదరికి మంచి క్రేజ్ ఉంది. ఆమెకు ఓట్ చేయాలంటూ వెస్టిండీస్ క్రికెట్ బ్రియాన్ లారా కూడా తన ఇంస్టాగ్రామ్ వేదికగా కోరడం ఆసక్తికరంగా మారింది. అయితే ఆమె ఇప్పుడు ఎలిమినేట్ అయిందని అంటున్నారు. ఈ వారం మొత్తం ఏడుగురు ఎలిమినేషన్స్ కోసం నామినేట్ అయ్యారు. ఆ ఏడుగురిలో ఆరోహీ రావు, సుదీప, ఇనయా సుల్తానా డేంజర్ జోన్ లో ఉన్నట్లుగా ముందు నుంచి ప్రచారం జరిగింది.

కానీ నేహా చౌదరి ఏకంగా ఇప్పుడు ఎలిమినేట్ అయిందని ఇప్పుడు చెబుతున్నారు. ఆమెకి నిజంగానే ఓట్లు తక్కువ వచ్చాయా లేక బిగ్ బాస్ సమీకరణాల ప్రకారం ఆమెను తప్పించారా అనేది మాత్రం తెలియాల్సింది. అయితే నిజంగా ఆమె ఎలిమినేట్ అయిందా లేదా అనే విషయం ఆదివారం సాయంత్రం ప్రసారమయ్యే ఎపిసోడ్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. బిగ్బాస్ లీక్స్ అన్ని నిజమవుతున్నాయి అని భావిస్తున్న క్రమంలో నిమజ్జంలో నేహా చౌదరి ఎలిమినేట్ అవ్వడం అయితే ఖాయం అనే ప్రచారం జరుగుతోంది.

అయితే నేహా ఎలిమినేషన్ కి కారణాలు విశ్లేషిస్తే టాస్క్ లో పెర్ఫామ్ చేస్తూనే పితూరీలు ఎక్కువగా చెబుతూ ఉండేది. అలాగే నేహా చౌదరికి సెలబ్రిటీలు సపోర్ట్ చేస్తున్నా కూడా సోషల్ మీడియాలో ఆమెకు స్వయంగా ఫేమ్ లేదు. ఆమెకు ఫాలోవర్స్ ఉన్నా ఇనయ, ఆరోహి, గీతు, వాసంతీలకంటే కూడా వెనకబడిపోవడంతో ఎలిమినేట్ అయిపోయిందని అంటున్నారు. మూడు వారాలకు ముగ్గురు ఎలిమినేట్ అయితే హౌస్ లో ఇంకా 18 మంది కంటెస్టెంట్ లో ఉంటారు. ఇక తాజా నామినేషన్స్ లో నాగార్జున నేరుగా ఇద్దరిని నామినేట్ చేయడం కూడా ఆసక్తికరంగా మారింది. బిగ్ బాస్ చరిత్రలోనే ఇప్పటివరకు ఇలాంటి ఘటన ఎప్పుడూ చోటు చేసుకోలేదని చెబుతున్నారు.

Also Read: Mega 154 Surprise: రవితేజ ఒక్కడే కాదు నాగార్జున-వెంకటేష్ కూడా?

Also Read: Megastar Chiranjeevi Crucial Decision: గాడ్ ఫాదర్ సినిమా విషయంలో మెగాస్టార్ సంచలన నిర్ణయం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News