Hebah Patel-Vijayendra prasad : బ్లాక్ అండ్ వైట్ మూవీ టీజర్.. హెబ్బా పటేల్ కోసం వచ్చిన విజయేంద్ర ప్రసాద్

Black And White Movie Teaser హెబ్బా పటేల్ నటించిన బ్లాక్ అండ్ వైట్ మూవీ టీజర్ ఇప్పుడు విడుదలైంది. ఇందులో హెబ్బా పటేల్ రెండు రకాల పాత్రల్లో కనిపించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 28, 2022, 04:53 PM IST
  • హెబ్బా పటేల్ కొత్త సినిమా
  • బ్లాక్ అండ్ వైట్ మూవీ టీజర్
  • గెస్టుగా స్టార్ రైటర్ వి విజయేంద్రప్రసాద్
Hebah Patel-Vijayendra prasad : బ్లాక్ అండ్ వైట్ మూవీ టీజర్.. హెబ్బా పటేల్ కోసం వచ్చిన విజయేంద్ర ప్రసాద్

Hebah Patel-Vijayendra prasad : హెబ్బా పటేల్ అందాలకు నెట్టింట్లో ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. అయితే ఆమెకు నటిగానూ మంచి ఫాలోయింగ్ ఉంది. కుమారి 21f సినిమాతో తెలుగు వారికి దగ్గరైన హెబ్బా పటేల్.. బోల్డ్ బ్యూటీగా వరుసగా అవకాశాలు అందుకుంది. చాలా గ్యాప్ తరువాత ఆహాలో ఓదెల రైల్వే స్టేషన్ సినిమాతో అందరినీ మెప్పించింది. అయితే ఇప్పుడు వరుసగా హెబ్బా పటేల్ సినిమాలతో ప్రేక్షకులను అలరించబోతోంది. ఈ క్రమంలోనే తాజాగా కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. 

హెబ్బా పటేల్ కొత్త చిత్రం బ్లాక్ అండ్ వైట్ టీజర్‌ను స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ రిలీజ్ చేశారు. ఎస్‌ఆర్ ఆర్ట్స్/ ఏ యూ అండ్ ఐ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్ బ్యానర్ల మీద పద్మనాభ రెడ్డి, సందీప్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎ మేఘనా రెడ్డి సమర్పణలో రాబోతోన్న ఈ  చిత్రానికి ఎల్‌ఎన్‌వి సూర్య ప్రకాష్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ మూవీ టీజర్‌ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News