Aadi Keshava Twitter Review: ఆదికేశవ ట్విట్టర్ రివ్యూ... ఈసారైనా వైష్ణవ్ కి హిట్ దక్కేనా

Aadi Keshava Review: మెగా కాంపౌండ్ హీరో వైష్ణవ్ తేజ్ వరస ప్లాపులతో సతమతమవుతున్నాడు. మొదటి సినిమా ఉప్పెన మినహా తరువాత ఆయనకి ఒక్క హిట్టు కూడా లేదు. ఈ నేపథ్యంలో పక్కా మాస్ సినిమాతో ఆదికేశవ అంటూ ఈరోజు మన ముందుకి వచ్చేసాడు.. మరి ఈ సినిమా గురించి ప్రేక్షకులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం..  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 24, 2023, 09:24 AM IST
Aadi Keshava Twitter Review: ఆదికేశవ ట్విట్టర్ రివ్యూ... ఈసారైనా వైష్ణవ్ కి హిట్ దక్కేనా

 Aadi Keshava: హీరో వైష్ణవ తేజ్ హీరోయిన్ శ్రీలీల కలిసి నటించిన చిత్రం ఆది కేశవ. శ్రీలీల హీరోయిన్ గా ఉన్నప్పటికీ ఈ చిత్రం మొదటి నుంచి ఎందుకు ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పుడే ప్రేక్షకులు ఈ చిత్రం రొటీన్ కథ అని ఫిక్స్ అయిపోయారు. మరి కనీసం థియేటర్స్ లో విడుదలయ్యాకన్నా కథ ఏదో కొంచెం డిఫరెంట్ గా ఉంది సినీ అభిమానులను ఈ చిత్రం లేదో ఒకసారి చూద్దాం…

మొదటినుంచి ఈ చిత్రం పైన సినీ ప్రేక్షకులకే కాదు ఈ చిత్రం నిర్మాతలకు కూడా ఇంట్రెస్ట్ లేనట్టే కనిపించింది. అందుకే ఈ సినిమాని పోస్ట్ ఫోన్ చేసుకుంటూ ఆఖరికి ఈరోజు విడుదల చేశారు. అయితే థియేటర్స్ లో విడుదలయ్యాక ఈ సినిమా చూసిన ప్రేక్షకులు కూడా ఏందిరా బాబు ఈ చిత్రం అంటున్నారు. ఒకరేమో ఫస్ట్ హాఫ్ అయింది అలా థియేటర్స్ నుంచి బయటకు వెళ్ళిపోతాం అన్నట్టు ఒక పోస్ట్ వేశారు.

అసలు దీన్ని ఒక సినిమా అంటారా.. ఇప్పుడు కూడా ఇలాంటి సినిమాలు ఏంటి రా బాబు అని ట్విట్టర్లో ఈ చిత్రాన్ని ఓ రేంజ్ లో వేసుకుంటున్నారు నేటిజన్స్. కాగా సోషల్ మీడియా మొత్తం పైన ఈ చిత్రానికి ఏదైనా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది అంటే…అది శ్రీలీల డాన్స్ గురించి మాత్రమే.. ముఖ్యంగా ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సాంగ్ నువ్వు విసలేస్తే పాటకి శ్రీలీల డాన్స్ వెయ్యడంతో.. ఆ వీడియో షేర్ చేసి శ్రీ లీలా డాన్స్ ఏమేసింది రా బాబు అందు కామెంట్లు పెడుతున్నారు.

 

ఈ పోస్ట్ మినహా ఈ సినిమా పాజిటివ్స్ గురించి ఇప్పటివరకు ఒక్కరు కూడా ఒక్క పోస్టు కూడా వేయకపోవడం గమనర్హం. ఇంకో యూసర్ అయితే రివ్యూ చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు.. శ్రీలీల డాన్స్ మినహా ఈ సినిమాలో ఏమీ లేదంటూ పెట్టారు.

 

మరొకరు నువ్వు నాకు నచ్చావులే బ్రహ్మానందం సీన్ ఆపందిరా బాబు అనే వీడియోని షేర్ చేసి ఈ చిత్రం చూస్తే పడే బాధను చెప్పకనే చెప్పాడు…

Also Read: Samsung Mobile Loot Offer: సాంసంగ్‌ వెబ్‌సైట్‌లో పిచ్చెక్కించే డీల్స్‌..Galaxy F54, M34 మొబైల్స్‌పై భారీ తగ్గింపు!  

 

Also Read: Oneplus 12 Launch: పిచ్చెక్కిపోయే ఫీచర్స్‌తో మార్కెట్లోకి Oneplus 12 స్మార్ట్ ఫోన్..ధర, ఫీచర్ల వివరాలు ఇవే..  

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

  

Trending News