Valentine's Day Movies: వాలెంటైన్స్ డే 2023 వచ్చేసింది.. ఈ సినిమాలు చూశారా ?

Valentine's Day 2023 Movies List: బిజీ షెడ్యూల్ కారణంగా బయటికి వెళ్లే సమయం, తీరిక లేక ఇంట్లోనే వాలెంటైన్స్ డే 2023 ని ఎంజాయ్ చేసే వారి కోసమే ఇదిగో ఈ ఆల్ టైమ్ క్లాసిక్ రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీస్. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ జాబితాలో మీ ఫేవరైట్ మూవీ కూడా ఉందేమో చూడండి. లేదంటే ఈ జాబితాలో ఉన్న సినిమాను మీరు ఇప్పటివరకు చూశారా లేదా చెక్ చేయండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 13, 2023, 11:24 PM IST
Valentine's Day Movies: వాలెంటైన్స్ డే 2023 వచ్చేసింది.. ఈ సినిమాలు చూశారా ?

Valentine's Day 2023 Movies List: వాలెంటైన్స్ డే 2023 రానే వచ్చేసింది. ప్రేమికుల రోజు అంటేనే ప్రేమ జంటలకు ఎంతో ప్రత్యేకమైన రోజు. వాలెంటైన్స్ డే నాడు కొంతమంది తమ లవర్ తో తమకు ఇష్టమైన ప్రదేశానికి వెళ్లి సరదాగా గడపడానికి ఇష్టపడుతుంటారు. ఇంకొంతమంది తమ ప్రేయసికి / ప్రియుడికి ఇష్టమైనదేదో బహుమతిగా అందించి సడెన్ సర్ ప్రైజ్ చేస్తుంటారు. ఇదిలా వుంటే, ఈ రెండింటికి సమయం లేని మరికొంతమంది మాత్రం తామిద్దరం కలిసి తమకు నచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీ చూసి ఇంట్లోనే ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. 

బిజీ షెడ్యూల్ కారణంగా బయటికి వెళ్లే సమయం, తీరిక లేక ఇంట్లోనే వాలెంటైన్స్ డే ఎంజాయ్ చేసే వారి కోసమే ఇదిగో ఈ ఆల్ టైమ్ క్లాసిక్ రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీస్. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ జాబితాలో మీ ఫేవరైట్ మూవీ కూడా ఉందేమో చూడండి. లేదంటే ఈ జాబితాలో ఉన్న సినిమాను మీరు ఇప్పటివరకు చూశారా లేదా చెక్ చేయండి.

దిల్ వాలే దుల్హనియా లే జాయెంగే

Valentines-Day-2023-Movies-List-Dilwale-Dulhania-Le-Jayenge.jpg

ఆదియా చోప్రా డైరెక్ట్ చేసిన దిల్ వాలే దుల్హనియా లే జాయెంగే సినిమాను అతడి సొంత నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ తెరకెక్కించింది. ఇండియాలో అంత్యంత సుదీర్ఘ కాలం పాటు థియేటర్లలో నడిచిన అరుదైన రికార్డు సొంతం చేసుకున్న సినిమా ఇది. షారుఖ్ ఖాన్‌ని లవర్ బాయ్‌గా, తిరుగులేని హీరోని చేసిన ఈ సినిమాలో షారుఖ్ ఖాన్, కాజోల్ మధ్య కెమిస్ట్రీ అత్యద్భుతం. అందుకే ఆ ఇద్దరూ ఎవర్ గ్రీన్ హిట్ పెయిర్ అయ్యారు. లవ్ స్టోరీస్ అంటే పడిచచ్చే వారికి ఇది ఎవర్ గ్రీన్ రొమాంటిక్ లవ్ స్టోరీ అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. సినిమాలో పాటలు ఈ సినిమాను మ్యూజికల్ హిట్ చేశాయి. ఈ సినిమా గురించి ఎంత ఎక్కువ చెప్పుకున్నా.. అది తక్కువే అవుద్ది. ఆ విషయం ఇలా చెప్పడం కంటే సినిమా చూశాకే ఇంకా బాగా అర్థమవుతుంది.

రెెహనా హై తేరే దిల్ మే

Valentines-Day-2023-Movies-RHTDM-movie-review-story-songs

రెహనా హై తేరే దిల్ మే. రొమాంటిక్ చిత్రాలకు పెట్టింది పేరైన గౌతం వాసుదేవ్ మీనన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగులో చెలి పేరిట విడుదలైంది. ఆర్ మాధవన్, రీమా సేన్, అబ్బాస్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా అప్పటి యువతను విశేషంగా ఆకట్టుకుంది. హరీశ్ జయరాజ్ అందించిన మ్యూజిక్ ఉర్రూతలూగించింది. ఇప్పటికీ మనోహరా సాంగ్ .. ఎవర్ గ్రీన్ ఫేవరైట్. ప్రేమపక్షులు మాడీ, రీనా మధ్య లవ్ కెమిస్ట్రీ జస్ట్ సింప్లీ సూపర్బ్. లవ్ స్టోరీస్ పట్ల క్రేజ్ పెంచిన అతి కొద్ది రొమాంటిక్ చిత్రాల్లో ఇది కూడా ఒకటి. ఇప్పటివరకు ఈ సినిమా ఇంకా చూడలేదా ? అయితే మీ వాలెంటైన్స్ డే సెలబ్రేషన్స్ మూవీస్ లిస్టులో ఇది తప్పకుండా ఉండాల్సిందే. 

హమ్ తుమ్

Valentines-Day-2023-Movies-hum-tum-movie-review-story-songs

సైఫ్ అలీ ఖాన్ - రాణి ముఖర్జీ జంటగా తెరకెక్కిన హమ్ తుమ్ చిత్రం లవ్ స్టోరీ. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ తో మొదలైన ఈ జంట లవ్ స్టోరీ ఎన్ని మలుపులు తిరిగింది, ఎలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంది ? చివరకు వారి డెస్టినీ ఏం డిసైడ్ చేసింది అనేదే హమ్ తుమ్ లవ్ స్టోరీ. సైఫ్ అలీ ఖాన్, రాణి ముఖర్జీలు తమ కెరీర్లోనే అద్భుతమైన పర్‌ఫార్మెన్స్ కనబర్చిన చిత్రం ఇది. కునాల్ కోహ్లి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను యశ్ రాజ్ ఫిలింస్ నిర్మించింది. రిషి కపూర్, కిరణ్ ఖేర్, జిమ్మి షెర్గిల్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. 

జబ్ వి మెట్

Valentines-Day-2023-Movies-jab-we-met-movie-review-story-songs

జబ్ వి మెట్ సినిమా పేరు ప్రస్తావించకుండా లవ్ స్టోరీస్ సినిమాల లిస్ట్ పూర్తి కాదు. గీత్, ఆదిత్య పాత్రల్లో షాహీద్ కపూర్, కరీనా కపూర్ ఆడియెన్స్‌ని మెస్మరైజ్ చేశారు. శ్రీ అష్టవినాయక్ సినీ విజన్ బ్యానర్ పై ధిలిన్ మెహతా నిర్మించిన ఈ సినిమాను ఇంతియాజ్ అలీ డైరెక్ట్ చేశాడు. ఇంతియాజ్ అలీ డైరెక్షన్ ఆకట్టుకుంటుంది. రెండు భిన్న ధృవాలు కలిగిన వ్యక్తులను తమకు తెలియకుండానే ప్రేమలో పడేసే చిత్రం ఇది. సినిమాలో హీరో, హీరోయిన్స్ లవ్ జర్నీ మిమ్మల్ని కూడా ఇన్‌వాల్వ్ అయ్యేలా చేస్తుంది. ఆ ఘనత ఇంతియాజ్ అలీ, షాహీద్ కపూర్, కరీనా కపూర్‌లదే. 

లవ్ ఆజ్ కల్

Valentines-Day-2023-Movies-love-aaj-kal-movie-review-story-songs

లవ్ ఆజ్ కల్ మూవీ.. హిందిలో మోస్ట్ లవ్‌డ్ రొమాంటిక్ మూవీస్ జాబితాలో ఇదీ ఒకటి. సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకునె జంటగా నటించిన ఈ చిత్రం నచ్చిన వాలెంటైన్స్ ఉండరు. ఈ సినిమా రిలీజై 13 ఏళ్లు పూర్తవుతున్నప్పటికీ.. ఇప్పటికీ ఆడియెన్స్‌ని ఆకట్టుకునే అతి కొద్ది చిత్రాల్లో లవ్ ఆజ్ కల్ ఉంటుంది. జబ్ వి మెట్ లాంటి లవ్ స్టోరీని తెరకెక్కించిన డైరెక్టర్ ఇంతియాజ్ అలీ చేసిన మరో మేజిక్కే లవ్ ఆజ్ కల్. ప్రేమికుల భాష మారిపోయిందా ఏంటనే సందేహం వచ్చేలా చేసే ఈ సినిమా అందించే ఫీలింగ్ గురించి మాటల్లో చెప్పడం కష్టమే అంటే అతిశయోక్తి కాదేమో !!

ఇది కూడా చదవండి : Hero Nani Clarity: నాని నోట బూతు పదం.. అసలు సంబంధమే లేదంటున్నాడే!

ఇది కూడా చదవండి : Jagapathi Babu Shocking Comments: అందరూ కమ్మ కుల పిచ్చోళ్ళు.. జగపతి బాబు హాట్ కామెంట్స్

ఇది కూడా చదవండి : Anchor Rashmi Gautam: బిగ్‌బాస్ షోలోకి యాంకర్ రష్మీ.. క్లారిటీ వచ్చేసింది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News