Jagapathi Babu Shocking Comments: అందరూ కమ్మ కుల పిచ్చోళ్ళు.. జగపతి బాబు హాట్ కామెంట్స్

Jagapathi Babu Shocking Comments: విజయవాడ సిద్దార్థ కాలేజ్ గురించి నటుడు జగపతి బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు, అక్కడి విధ్యార్దుల కుల ప్రస్తావన తెచ్చిన ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 

Last Updated : Feb 13, 2023, 08:38 PM IST
Jagapathi Babu Shocking Comments: అందరూ కమ్మ కుల పిచ్చోళ్ళు.. జగపతి బాబు హాట్ కామెంట్స్

Jagapathi Babu Shocking Comments Mentioning Kamma Caste: ఎవరు అవునన్నా కాదన్నా తెలుగు సినీ పరిశ్రమలో కుల ప్రభావం కచ్చితంగా ఉంటుంది. ఇప్పుడంటే కొంత కులంతో సంబంధం లేకుండా టాలెంట్ చూసి అవకాశాలు దొరుకుతున్నాయేమో గాని ఒకానొక సమయంలో అవకాశాల కోసం వచ్చిన వారిని మీరేమిట్లు అని అడిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని అనేక ఇంటర్వ్యూలో బయటపెడుతూ ఉండేవారు. అయితే అలాంటి సినీ పరిశ్రమలో సైతం కులాల ప్రస్తావన లేకుండా కులాలకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్లు కూడా ఉంటారు. అలాంటి వారిలో జగపతిబాబు ఒకరు.

రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక అగ్రకులంలో జన్మించిన జగపతిబాబు పేరు చివర కూడా ఆయన కులం తోక ఉంటుంది. అయితే కులం మీద విరక్తి తెచ్చుకున్న ఆయన ఆ కులం తోకను సైతం కత్తిరించారు అనుకోండి అది వేరే విషయం. ఇక తాజాగా ఆయన కుల ప్రస్తావన చేస్తూ చేసిన కొన్ని కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిన్న జగపతిబాబు పుట్టినరోజు సందర్భంగా ఒక యూట్యూబ్ ఛానల్ ఆయనతో ఒక ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో భాగంగా తాను ఒకసారి విజయవాడ సిద్ధార్థ కాలేజ్ కి వెళ్లానని ఆ సమయంలో కులానికి వ్యతిరేకంగా మాట్లాడతానని తాను అన్నానని అయితే అలాంటి పనులు చేయవద్దని ఆ కాలేజీ ప్రిన్సిపల్ వేడుకున్నారని అన్నారు.

ఎందుకు మాట్లాడవద్దు అని తాను అడిగితే కాలేజీ ఆడిటోరియంలో 2000 మంది ఉన్నారు, వాళ్లంతా కమ్మ కుల పిచ్చోళ్లు, మీరు కనుక కులానికి వ్యతిరేకంగా కామెంట్ చేస్తే మిమ్మల్ని పీస్ పీస్ చేసేస్తారు అని అర్థం వచ్చేలా ఆయన కామెంట్ చేశారని ఆయన విజ్ఞప్తి మేరకు తాను అలాంటి కామెంట్లు చేయకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయాను అని చెప్పుకొచ్చారు.

ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇదంతా ఇప్పుడు జరిగిన విషయం కాదని 15 ఏళ్ల క్రితం జరిగిందని ఆయన అన్నారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో తనకు తెలియదు కానీ అప్పట్లో మాత్రం ఇలా అనే వారని జగపతి బాబు అన్నారు. ఇక ఈ కాలేజీ నుంచే  రాంగోపాల్ వర్మ తన ఇంజనీరింగ్ డిగ్రీ పుచ్చుకున్న సంగతి చాలా తక్కువ మందికే తెలుసు. ఈ కాలేజీలో జరిగిన సంఘటనలో ఆధారంగా చేసుకుని ఆయన శివ అనే సినిమా తెరకెక్కించి తెలుగు సినీ పరిశ్రమలోనే ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచి అందరికీ ఆదర్శప్రాయుడయ్యాడు.

Also Read; Aero india 2023: ప్రధాని మోడీ చేతుల మీదుగా ఏరో ఇండియా 2023 ప్రారంభం.. థీం ఏంటో తెలుసా?

Also Read: Best Camera Smartphones: 15 వేలలో అదిరిపోయే కెమెరా ఫోన్లు.. ఫీచర్లతో సహా మీకోసం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 

Trending News