Varudu Heroine Bhanu Sri : పెళ్లైతే ఇక అంతేనా? అది పెరిగితే అలా చేస్తారా?.. తిరగబడ్డ వరుడు హీరోయిన్ భాను శ్రీ

Varudu Heroine Bhanu Sri Mehta వరుడు హీరోయిన్ భాను శ్రీ మెహతా తాజాగా వేసిన ట్వీట్ మళ్లీ మంటలు పుట్టించేస్తోంది. ఇండస్ట్రీలో హీరోయిన్లను చూసే తీరు మీద మండి పడింది. హీరోలకు ఏజ్ అయిపోయినా కూడా ఇంకా కుర్ర హీరోయిన్లతో ఆడతారని చెప్పుకొచ్చింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 24, 2023, 04:44 PM IST
  • నెట్టింట్లో వరుడు హీరోయిన్ రచ్చ
  • ఏజ్, పెళ్లి అయితే హీరోయిన్ల పరిస్థితి అంతేనా?
  • తిరగబడ్డ వరుడు హీరోయిన్ భాను శ్రీ మెహతా
Varudu Heroine Bhanu Sri : పెళ్లైతే ఇక అంతేనా? అది పెరిగితే అలా చేస్తారా?.. తిరగబడ్డ వరుడు హీరోయిన్ భాను శ్రీ

Varudu Heroine Bhanu Sri Mehta వరుడు హీరోయిన్ భాను శ్రీ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రచ్చ రచ్చగా మారింది. అల్లు అర్జున్ తనను ట్విట్టర్‌లో బ్లాక్ చేశాడంటూ వాపోయింది భాను శ్రీ. అయితే ఆ తరువాత కొద్ది సేపటికే బన్నీ మళ్లీ అన్ బ్లాక్ చేశాడంటూ సంబరపడింది భాను. ఈ గ్యాప్‌లో భాను శ్రీని బన్నీ ఫ్యాన్స్ ఆడేసుకున్నారు. నువ్ ఎంతగా విసిగించావో.. అందుకే అలా బ్లాక్ చేసి ఉంటాడని భానుశ్రీని ట్రోల్ చేశారు.

తాజాగా హీరోయిన్ భాను శ్రీ ఓ ట్వీట్ వేసింది. ఇందులో హీరోయిన్ల ప్రధాన సమస్యను ప్రశ్నించింది. హీరోయిన్లకు ఏజ్ దాటితే.. వాళ్లని తల్లిగానో, వదినగానో, అక్కగానో ఇలా సైడ్ కారెక్టర్లను ఇస్తారు.. అదే హీరోలకు మాత్రం ఎంత ఏజ్ అయినా కూడా, వారి ఏజ్‌లో సగం ఉండే హీరోయిన్లతో ఆడిపాడతారు.. ఇలా ఎందుకు పక్షపాతం చూపిస్తారు. పెళ్లయిందని, వయసు పెరిగిందని ఇలా ఎందుకు చేస్తారు?

 

ఇప్పటికైనా ఇలాంటివి ఆపేయండి.. తేడాలను చూడొద్దు.. మహిళా ప్రధానమైన కథలను చెప్పండి అని తిరగబడింది భాను శ్రీ మెహతా. మరి ఈమె ఆవేదనను ఎవరైనా పట్టించుకుంటారా? అన్నది చూడాలి. ఇది అసలే మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ. ఆరు పదులకు వచ్చినా, ఏడు పదుల ఏజ్ వచ్చినా కూడా కుర్ర హీరోయిన్లతో ఆట పాటలు వేసేందుకు రెడీగా ఉంటారు. కానీ హీరోయిన్లు మాత్రం మూడు పదులు దాటితే సైడ్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తారు.

బన్నీ తనను బ్లాక్ చేశాడని, వరుడు సినిమా తరువాత తన కెరీర్ పూర్తిగా కనిపించకుండాపోయిందని వాపోయిన సంగతి తెలిసిందే. అయితే బన్నీ అభిమానులు ట్రోల్ చేయడంతో భాను శ్రీ స్పందించింది. తన కెరీర్ ఇలా అవ్వడానికి బన్నీ కారణం అని తాను ఎప్పుడూ కూడా ఎక్కడ కూడా చెప్పలేదని క్లారిటీ ఇచ్చింది. పైగా తాను బన్నీకి వీరాభిమానిని అని చెప్పుకొచ్చింది.

Also Read:  Manchu Manoj Vs Manchu Vishnu: రోడ్డున పడ్డ మంచు గౌరవం?.. ఇంటిపై దాడులు చేస్తాడు మంచు విష్ణు వీడియో షేర్ చేసిన మనోజ్

Also Read: Manchu Family Fighting : మంచు బ్రదర్స్ వివాదం.. రంగంలోకి మోహన్ బాబు?.. వెనక్కి తగ్గిన మనోజ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News