Varun Tej Ghani Movie: వరుణ్​ తేజ్​ 'గని' సినిమా సాంగ్​ ప్రోమో చూశారా?

Varun Tej Ghani Movie: టాలీవుడ్​ యంగ్​ హీరో వరుణ్​ తేజ్​ హీరోగా నటిస్తున్న చిత్రం 'గని'. డిసెంబరు 3న సినిమా రిలీజ్​ (Ghani Movie Release Date) కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్​ మొదలుపెట్టింది. సినిమాలోని తొలి లిరికల్​ సాంగ్​ ప్రోమోను మంగళవారం విడుదల చేసింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 26, 2021, 05:23 PM IST
    • వరుణ్​ తేజ్​ 'గని' సినిమా ఫస్ట్​ సింగిల్​ ప్రోమో రిలీజ్​
    • పూర్తి పాటను అక్టోబరు 27న రిలీజ్​ చేయనున్న చిత్రబృందం
    • వరుణ్​ తేజ్​ కెరీర్​లో మైలురాయిగా ఈ చిత్రం నిలుస్తుందని మేకర్స్​ వెల్లడి
Varun Tej Ghani Movie: వరుణ్​ తేజ్​ 'గని' సినిమా సాంగ్​ ప్రోమో చూశారా?

Varun Tej Ghani Movie: మెగా ప్రిన్స్​ వరుణ్​ తేజ్​ అప్​కమింగ్​ మూవీ (Varun Tej Upcoming Movie) 'గని' నుంచి ఓ క్రేజీ అప్​డేట్​ వచ్చేసింది. ఈ సినిమాలోని తొలి లిరికల్​ సాంగ్ ప్రోమో​ను (Ghani Movie Anthem) మంగళవారం (అక్టోబరు 26) చిత్రబృందం విడుదల చేసింది. దీనికి సంబంధించిన పూర్తి పాటను బుధవారం ఉదయం 11.08 గంటలకు రిలీజ్​ చేయనున్నట్లు తెలిపింది. తమన్​ సంగీతాన్ని అందించిన ఈ సాంగ్​ ప్రోమో శ్రోతులను ఆకట్టుకుంటోంది. మరోవైపు ఇటీవలే విడుదలైన 'గని ఫస్ట్​ పంచ్​' గ్లింప్స్​కు (Ghani First Punch) ప్రేక్షకుల నుంచి విశేషాదరణ దక్కుతోంది. ఈ సినిమాను డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల (Ghani Movie Release Date) చేయనున్నట్టు చిత్రబృందం ఇటీవలే వెల్లడించింది. 'గని' సినిమా రిలీజ్​ డేట్​ దగ్గర పడుతున్న క్రమంలో చిత్ర ప్రమోషన్స్​ను నిర్మాతలు మొదలుపెట్టేశారు.  

'గని' సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్​గా కనిపించనున్నాడు. అందులో వరుణ్​ తేజ్​ సరసన బాలీవుడ్ నటి సాయి మంజ్రేకర్ (Saiee Manjrekar New Movie) జంటగా నటిస్తుండగా కన్నడ స్టార్​ హీరో ఉపేంద్ర, బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అల్లు అరవింద్ ప్రజెంట్ చేస్తున్న ఈ 'గని' చిత్రాన్ని రెనైసన్స్ పిక్చర్స్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్‌పై సిద్ధు ముద్దా, అల్లు వెంకటేష్ నిర్మిస్తున్నారు. వరుస హిట్స్‌తో జోష్ మీదున్న ఎస్​ఎస్ తమన్​ మ్యూజిక్ కంపోజ్ చేస్తుండగా జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రాఫర్​గా వర్క్​ చేస్తున్నాడు. 

వరుణ్ తేజ్ (Varun Tej News) కెరీర్‌లో మరో మైలురాయిగా 'గని' చిత్రం నిలిచిపోతుందని ఈ సినిమా మేకర్స్ చెబుతున్నారు. చిత్ర నిర్మాతలు చెబుతున్నట్లుగా 'గని' చిత్రం (Varun Tej Ghani Movie) అంచనాలకు తగ్గట్లు ఉంటుందా? లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. 
వరుణ్ తేజ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ విషయానికొస్తే.. ప్రస్తుతం వరుణ్ 'ఎఫ్​ 3' సినిమా (Varun Tej New Movie) షూటింగ్​లో బిజీగా ఉన్నాడు. 'ఎఫ్​ 2' సినిమాకు సీక్వెల్‌గా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లోనే షూటింగ్ (F3 movie shooting sets) జరుపుకొంటోంది. విక్టరీ వెంకటేష్​, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ పిర్జాదా, రాజేంద్ర ప్రసాద్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.  

Also Read: Varun Doctor Movie OTT: ఓటీటీ రిలీజ్​కు సిద్ధమైన శివకార్తికేయన్ 'వరుణ్ డాక్టర్​'  

Also Read: Ranbir Alia Wedding: డెస్టినేషన్​ వెడ్డింగ్​కు ప్లాన్​ చేస్తున్న రణ్​బీర్​ - అలియా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook.

Trending News