Gandeevadhari Arjuna Pre-Teaser: హాలీవుడ్‌ రేంజ్‌ లో 'గాండీవధారి అర్జున' ప్రీ-టీజర్‌.. వరుణ్ దుమ్ములేపేడుగా...!

Varun Tej upcoming Movie: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ 'గాండీవధారి అర్జున'. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫ్రీ-టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 12, 2023, 03:48 PM IST
Gandeevadhari Arjuna Pre-Teaser: హాలీవుడ్‌ రేంజ్‌ లో 'గాండీవధారి అర్జున' ప్రీ-టీజర్‌.. వరుణ్ దుమ్ములేపేడుగా...!

Gandeevadhari Arjuna Movie Pre-Teaser: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం గాండీవధారి అర్జున. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25న రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా పాచ్ వర్క్  పూర్తి చేసుకుంటుంది. తాజాగా ఈ మూవీ ప్రీ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. దీనిని చూస్తుంటే హాలీవుడ్ స్టైల్ ఆప్ మేకింగ్ కనిపిస్తుంది. వరుణ్ లుక్ కూడా చాలా కొత్తగా ఉంది. 

టీజర్ లో.. వేగంగా వెళ్తున్న కారు..వెనకాల ఉన్న డిక్కీలో గన్స్‌.. వాటిలోంచి ఒక మిస్సైల్‌ లాంటి గన్‌ తీసుకుని వరుణ్ శత్రువులపై ఎటాక్ చేయడం కనిపిస్తోంది. ప్రీ టీజర్‌ ఇలా ఉంటే ట్రైలర్ ఏ రేంజ్ లో ఉండబోతుందోనని మెగా అభిమానులు ఆలోచిస్తున్నారు.  యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్‌పై బీవిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు.  సహా నిర్మాతగా నాగబాబు వ్యవహరిస్తున్నాడు. మిక్కీ జే మేయర్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సాక్షీ వైద్య హీరోయిన్‌గా నటిస్తోంది. బీజీఎం సినిమాపై ఆసక్తిని పెంచేలా చేసింది. నాజర్, విమలా రామన్, రవి వర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

Also Read: Nani 30 Update: 'నాని 30' ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ డేట్ అనౌన్స్.. ఇంతకీ టైటిల్ ఏంటో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News