Veera Simha Reddy Pre Release Event at Ongole: నందమూరి బాలకృష్ణ హీరోగా వీర సింహారెడ్డి అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా బాలకృష్ణ కెరియర్ లో 107వ సినిమాగా రూపొందుతోంది. శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, లాల్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు.
ఈ సినిమాని జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సినిమా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి అదే సమయానికి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణంలో రూపొందిన మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా కూడా రిలీజ్ అవుతూ ఉండడంతో ఈ సినిమా రిలీజ్ చేయకపోవచ్చు అని అందరూ భావించారు. కానీ ఎందుకో రెండు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ వారు.
అయితే ఇప్పుడు తాజాగా బాలకృష్ణ సినిమా కి సంబంధించి మరో ఆసక్తికరమైన అప్డేట్ తెరమీదకు వచ్చింది. అదేమిటంటే బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి ఆరో తేదీన ఒంగోలులో భారీ ఎత్తున జరగబోతుందని తెలుస్తోంది. వాస్తవానికి ఈ మధ్య నందమూరి బాలకృష్ణ సినిమాలకు సంబంధించిన ఏ ఈవెంట్ అయినా కర్నూలు, అనంతపురం, విజయవాడ, గుంటూరు ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోనే ఎక్కువగా చేస్తూ వస్తున్నారు.
అదే సంప్రదాయాన్ని పాటిస్తూ జనవరి ఆరవ తేదీన ఒంగోలులో వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ అయితే చరమాంకంలో ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ అయితే జరుగుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ సెట్స్ ను పవన్ కళ్యాణ్ సందర్శించడంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇక తాజాగా వీర సింహారెడ్డి సినిమా నుంచి మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి అని ఐటెం సాంగ్ రిలీజ్ చేయగా ఆ ఐటెం సాంగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. మలయాళ భామ హనీ రోజ్, ఆస్ట్రేలియన్ ఇండియన్ చంద్రిక రవి ఈ సాంగ్ లో బాలకృష్ణతో కలిసి స్టెప్పులు వేశారు. మంచి మాస్ మసాలా హాట్ నెంబర్ గా ఈ సాంగ్ నిలిచిపోబోతుందని సినిమా యూనిట్ అయితే చెబుతోంది. చూడాలి మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అనేది.
Also Read: IndiGo winter Sale 2023: ₹2వేలకే విమాన టికెట్.. ఇండిగో స్పెషల్ ఆఫర్ చూశారా!
Also Read: ఎన్టీఆర్‌కు వెన్నుపోటులో ఆరుగురు మహిళలు.. అప్పటి నిజం బయటపెట్టిన వెంకయ్యనాయుడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.