Rashmika Mandanna: అందుకే అతనితో రష్మిక బ్రేకప్.. సంచలన విషయం బయట పెట్టిన వేణుస్వామి

Venuswamy Reveals Secrets of Rashmika Breakup: స్టార్ హీరోయిన్ గా మారిన రష్మిక మందన్న ఆ స్థాయికి వెళ్లడానికి తానే కారణం అంటున్నారు వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి.  ఆ వివరాల్లోకి వెళితే  

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 19, 2022, 07:05 PM IST
  • రష్మిక మందన్నా బ్రేకప్ విషయం తెరమీదకు
  • నేనే కారణమన్న వేణుస్వామి
  • హాట్ టాపిక్ గా మారిన కామెంట్స్
Rashmika Mandanna: అందుకే అతనితో రష్మిక బ్రేకప్.. సంచలన విషయం బయట పెట్టిన వేణుస్వామి

Venuswamy Reveals Secrets of Rashmika Breakup: ఇప్పుడు తెలుగు సహా దక్షిణాది భాషల్లో కాక ఉత్తరాదిలో కూడా స్టార్ హీరోయిన్ గా మారిన రష్మిక మందన్న ఆ స్థాయికి వెళ్లడానికి తానే కారణం అంటున్నారు వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి. సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన వేణు స్వామి గతంలో సమంత, నాగచైతన్య విడాకులను ముందే ఊహించి హాట్ టాపిక్ గా మారారు. వారిద్దరి జాతకాల ప్రకారం వారు పెళ్లి చేసుకుంటే ఎక్కువకాలం కలిసి ఉండలేరని ఆయన చెప్పిన వ్యాఖ్యలే నిజమయ్యాయి.

వారిద్దరు విడాకులు తీసుకోవడంతో ఒక్కసారిగా  ఆయన గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే తాజాగా ఒక మీడియా ఇంటర్వ్యూలో రష్మిక మందన్న తన పాత బాయ్ ఫ్రెండ్ ని వదిలేయడానికి కారణం తానేనని చెప్పడమే కాకుండా ఆమె ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా మారింది అంటే దానికి కూడా తానే కారణమని చెప్పుకొచ్చారు ఆయన. రష్మిక మందన్న తెలుగులో హీరోయిన్ గా మారిన తర్వాత తన వద్దకు వచ్చి కలిసిందని, అప్పటికే ఆమె కన్నడలో రక్షిత్ శెట్టి అనే ఆయనను ఎంగేజ్మెంట్ చేసుకుందని చెప్పుకొచ్చారు.

తాను స్టార్ హీరోయిన్ అవ్వాలంటే ఏం చేయాలి అని అడిగితే తాను వారిద్దరి జాతకాలు చూసి మీరిద్దరూ విడిపోతే ఇద్దరికీ బాగుంటుందని సలహా ఇచ్చానని అంతేకాక రాజ్యశ్యామల యాగంలో మొదటి లెవల్ యాగం జరిపించానని ఆయన అన్నారు. ఇప్పుడు చూశారు కదా ఆమె ఏ స్థాయిలో ఉందో నేషనల్ క్రష్ గా మారిపోయింది అంటూ వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అంతేకాక ఆమె కర్ణాటక నుంచి కాంగ్రెస్ ఎంపీగా కూడా గెలిచి లోక్ సభకు వెళుతుందని ఆయన జోస్యం చెప్పారు.

ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. పుష్ప సినిమాతో సూపర్ క్రేజ్ అందుకున్న రష్మిక మందన్న బాలీవుడ్ లో కూడా పలు సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. 

Also Read: Nithya Menon Marriage: పెళ్లికి సిద్దమైన నిత్యామీనన్.. ఆ హీరోతోనేనేనా!

Also Read: Sravana Bhargavi: వెంకన్న కీర్తనతో వివాదంలో శ్రావణ భార్గవి.. బాధ్యతారాహిత్యంగా

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News