Venkatesh New Movie : మరో మలయాళ మూవీ రీమేక్‌లో వెంకటేశ్‌, డ్రైవింగ్ లైసెన్స్‌లో హీరోగా వెంకీ

Venkatesh New Movie driving licence remake : మలయాళం సూపర్ హిట్ మూవీ.. డ్రైవింగ్ లైసెన్స్ ను తెలుగు రీమేక్‌ చేయబోతున్నారట. అందులో హీరోగా వెంకటేశ్‌ నటించనున్నారని సమాచారం. డ్రైవింగ్ లైసెన్స్ మలయాళం మూవీ.. పృథ్వీరాజ్, సూరజ్ ప్రధాన పాత్రలతో తెరకెక్కింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 7, 2021, 05:28 PM IST
  • రీమేక్ సినిమాలపై విక్టరీ వెంకటేశ్‌ ఫోకస్
  • ఈ ఏడాది వెంకీ రెండు రీమేక్‌లు సూపర్ హిట్
  • మలయాళం సూపర్ హిట్ మూవీ.. డ్రైవింగ్ లైసెన్స్ తెలుగులో రీమేక్‌, హీరోగా వెంకటేశ్‌
Venkatesh New Movie : మరో మలయాళ మూవీ రీమేక్‌లో వెంకటేశ్‌, డ్రైవింగ్ లైసెన్స్‌లో హీరోగా వెంకీ

Victory Venkatesh desires for another Malayalam Movie driving licence remake: రీమేక్ సినిమాలు విక్టరీ వెంకటేశ్‌కు బాగా కలిసొస్తున్నాయి. వెంకీ నటించిన రీమేక్ మూవీల్లో చాలా వరకు సూపర్ హిట్ అయ్యాయి. ఈ ఏడాది వెంకీ రెండు రీమేక్‌లు రిలీజ్‌ అయి హిట్ అయ్యాయి. త‌మిళంలో (Tamil) హిట్ అయిన అసూరన్ మూవీ తెలుగులో నారప్పగా వచ్చింది. అలాగే మలయాళంలో సూపర్‌‌ హిట్ అయిన దృశ్యం మూవీకి సీక్వెల్‌గా వచ్చిన దృశ్యం 2 మూవీలో కూడా వెంకటేశ్ (Venkatesh) మెప్పించారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి (Anil Ravipudi) డైరెక్షన్‌లో ఎఫ్ 3 మూవీలో నటిస్తున్నారు వెంకటేశ్‌. ఫిబ్రవరి 25న ఈ మూవీ రిలీజ్ కానుంది. 

దీని తర్వాత మలయాళం సూపర్ హిట్ మూవీ (Malayalam Movie ).. డ్రైవింగ్ లైసెన్స్ (driving licence) ను తెలుగు రీమేక్‌ చేయబోతున్నారట. అందులో హీరోగా వెంకటేశ్‌ నటించనున్నారని సమాచారం. డ్రైవింగ్ లైసెన్స్ మలయాళం మూవీ.. పృథ్వీరాజ్, సూరజ్ ప్రధాన పాత్రలతో తెరకెక్కింది.

ఇక ఈ మూవీ రీమేక్ హక్కులు ముందుగా రామ్ చరణ్ దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఈ రైట్స్ రామ్‌చ‌ర‌ణ్‌ (Ramcharan) నుంచి గీతా ఆర్ట్స్ కు వెళ్లాయి. దీంతో అల్లు అరవింద్... డ్రైవింగ్ లైసెన్స్ రీమేక్ వెంకటేశ్‌ తోనే చెయ్యాడని డిసైడ్ అయ్యాటర. త్వరలోనే డ్రైవింగ్ లైసెన్స్ మూవీ గురించి అఫీషియరల్ అనౌన్స్‌మెంట్ రానుంది. 

Also Read : Flipkart Sale: రూ.30 వేల కంటే తక్కువ ధరతో iPhone 12 మీ సొంతం చేసుకోండి!

ఇక టాలీవుడ్‌లో ప్రస్తుతం అంతా రీమేక్‌ల హవానే నడుస్తోంది. లూసిఫ‌ర్ రీమేక్ గా చిరంజీవి హీరోగా.. గాడ్‌ఫాద‌ర్‌ (Godfather) తెరకెక్కుతోంది. ఇక అయ్య‌ప్ప‌నుమ్ కోశియుమ్ మూవీ రీమేక్‌గా ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా.. భీమ్లానాయ‌క్‌ (Bheemla Nayak) మూవీ రూపొందుతోంది. 

Also Read : Benifits of having Beard: 'గడ్డం'తో మీకు తెలియని సీక్రెట్ హెల్త్ బెనిఫిట్స్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News