Liger Movie Record: విజయ్ దేవరకొండ లైగర్ ఫస్ట్‌లుక్ పోస్టర్ అరుదైన ఘనత

Liger Movie Record: యూత్‌లో క్రేజీ స్టార్‌గా ఉన్న విజయ్ దేవరకొండ తాజా చిత్రం విడుదలకు ముందే అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమానే ట్రెండింగ్‌లో ఉంది. ఆ ఫస్ట్‌లుక్ ఇంకా వైరల్ అవుతోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 19, 2021, 09:38 PM IST
 Liger Movie Record: విజయ్ దేవరకొండ లైగర్ ఫస్ట్‌లుక్ పోస్టర్ అరుదైన ఘనత

Liger Movie Record: యూత్‌లో క్రేజీ స్టార్‌గా ఉన్న విజయ్ దేవరకొండ తాజా చిత్రం విడుదలకు ముందే అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమానే ట్రెండింగ్‌లో ఉంది. ఆ ఫస్ట్‌లుక్ ఇంకా వైరల్ అవుతోంది.

తెలుగు సినీ పరిశ్రమలో యూత్‌లో మంచి క్రేజీ స్టార్‌గా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) అప్ కమింగ్ మూవీ కొత్త రికార్డు సాధించింది. విడుదలకు ముందే సినిమా మరోసారి హైలైట్ అవుతోంది. విజయ్ దేవరకొండ తాజా చిత్ర లైగర్ ఫస్ట్‌లుక్ (Liger First look)ఈ ఘనతను సాధించింది. సోషల్ మీడియాలో అత్యధికంగా లైక్స్ రాబట్టిన ఫస్ట్‌లుక్‌గా ఖ్యాతినార్జించింది.ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్ ఇన్‌స్టాగ్రామ్‌లో(Instagram)ఏకంగా 2 మిలియన్లకు పైగా లైక్స్ సాధించింది. ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు ఈ స్థాయిలో లైక్స్ రావడం దక్షిణాది సినిమాల్లో ఇదే తొలిసారి. ఈ మూవీలో విజయ్ దేవరకొండ సరికొత్త లుక్‌తో కన్పించనున్నాడు. లైగర్ సినిమా కోసం విజయ్ పూర్తిగా మేకోవర్ చేసుకున్న లుక్‌కు మంచి స్పందన లభిస్తోంది.

మాస్ దర్శకుడు పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ మూవీని బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్, ధర్మ ప్రొడక్షన్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై కరణా్ జోహార్, పూరి జగన్నాథ్ , ఛార్మిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.సెప్టెంబర్ 9న దేశవ్యాప్తంగా విడుదల కానున్న లైగర్ మూవీతో అనన్య టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది.

Also read: Ram charan movie: శంకర్-రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీలో బ్యూటీ ఎవరో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News