Maharaja Movie Total Box Office Collections: విజయ్ సేతుపతి తమిళంలో ఎన్నో గుర్తింపు లేని పాత్రల్లో నటించిన ఆ తర్వాత నటుడిగా మారి హీరోగా ప్రమోషన్ పొందారు. అంతేకాదు హీరోగా చేస్తూనే.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా,విలన్ గా తనదైన లెవల్లో సత్తా చూపెడుతున్నాడు. ఒకవైపు వేరే హీరో సినిమాల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూనే.. మంచి పాత్ర దొరికితే హీరోగా నటిస్తున్నాడు. ఈ కోవలో ఈయన హీరోగా నటించిన చిత్రం ‘మహారాజ’. ఈ సినిమా విజయ్ సేతుపతి ‘క్షురకుడి పాత్రలో నటించి మెప్పించాడు. ఈ సినిమాను నితిలన్ స్వామినాథన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
ఈ సినిమా తమిళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతేకాదు తెలుగులో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతేకాదు నటుడిగా విజయ్ సేతుపతికి ఇది 50వ చిత్రం. తన మైల్ స్టోన్ చిత్రంలో విజయ్ సేతుపతి తన కెరీర్ లో గుర్తుండిపోయేలా నటించి మెప్పించాడు. ఈ సినిమా తెలుగులో రూ. 3 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా రూ. 3.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగి మొత్తంగా రూ. 6.45 కోట్ల షేర్ (రూ. 13.15 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా మొత్తంగా థియేట్రికల్ గా 2.95 కోట్ల లాభాలను తీసుకొచ్చింది.
మరోవైపు తమిళం సహా వరల్డ్ వైడ్ గా రూ. 20 కోట్ట ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 21 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో కలిసి వసూళ్లు చేసిన కలెక్షన్స్ విషయానికొస్తే..
తమిళనాడు - రూ. 53.85 కోట్ల గ్రాస్
తెలుగు రాష్ట్రాలు - రూ. 13.15 కోట్ల గ్రాస్
కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్ - రూ. 13.30 కోట్ల గ్రాస్
ఓవర్సీస్ - రూ. 24.25 కోట్ల గ్రాస్
మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 104.55 కోట్ల గ్రాస్ (రూ. 50.55 కోట్ల షేర్) రాబట్టింది. మొత్తంగా ఈ సినిమా చేసిన బిజినెస్ కంటే రూ. 29.55 కోట్ల లాభాలను ఆర్జించి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
మొత్తంగా విజయ్ సేతుపతి సినిమా ‘మహారాజ’ సినిమా థియేట్రికల్ గానే కాకుండా ఓటీటీ వేదికగా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అంతేకాదు అక్కడ ఈ సినిమా బాలీవుడ్ సినిమాలతో పోటీ పడి మరి నెంబర్ ట్రెండింగ్ లో కొనసాగడం విశేషం. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..
ఇదీ చదవండి: చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి