12th Fail : ప్రస్తుతం ఒక బాలీవుడ్ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఐఎండిబి లో ఇండియన్ హైయెస్ట్ ర్యాంకింగ్ సినిమాగా పేరు తెచ్చుకుంది. విధు వినోద్ చోప్రా డైరెక్ట్ చేసిన ఈ సినిమా అనురాగ్ పాఠక్ రాసిన కథ ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో విక్రాంత్ మాస్సే హీరోగా కనిపించి తన అద్భుతమైన నతలతో అందరినీ ఆకట్టుకున్నాడు.
27 అక్టోబర్ 2023 న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కేవలం రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించగా.. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.60 కోట్లకు పైగా వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంటే ఈ చిత్రం పెట్టిన బడ్జెట్ కన్నా మూడు రెట్లు ఎక్కువ వసూలు చేసింది.
కాగా అసలు ఈ సినిమా కథ ఏమిటి.. ఈ చిత్రం ఎందుకు ఇంత హిట్ అయింది.. అసలు ఈ సినిమా ఎవరి బయోపిక్? అనే వివరాలు ఒకసారి చూద్దాం..
ఈ సినిమా 2019 లో అనురాగ్ పాఠక్ రాసిన పుస్తకం ఆధారంగా తెరకెక్కింది. ఈ పుస్తకాన్ని ప్రముఖ ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ జీవిత చరిత్ర ఆధారంగా రాశారు. ఇక ఆయన జీవిత కథనే 12th ఫెయిల్ సినిమాగా తెరకెక్కించారు. మనోజ్ కుమార్ శర్మ ఐపీఎస్ ఆఫీసర్ కావడానికి ఎలాంటి కష్టాలు పడ్డారు.. అసలు ఆయన ఆ పోసిషన్ కి ఎలా రాగలిగారు.. అన్నది ఈ సినిమా అసలు కథ.
మధ్యప్రదేశ్‌లో..మొరెనా జిల్లా లో బిల్‌గావ్ అనే గ్రామంలో 1977 లో జన్మించారు మనోజ్ కుమార్. ఆయన తండ్రి వ్యవసాయ శాఖలో ఉద్యోగం చేసేవారు. అయితే శర్మ చిన్నప్పుడు ఆయన కుటుంబం చాలా ఆర్ధిక సమస్యలు ఎదుర్కుందట. చిన్న వయసులో శర్మ చదువుపట్ల ఆసక్తి అస్సలు చూపేవారు కాదట. 9, 10 తరగతిలో కూడా ఆయనకు థర్డ్ క్లాస్ మార్కులు వచ్చెవట. XII తరగతిలో అయితే హిందీ లో తప్ప అన్ని సబ్జెక్ట్స్‌లో ఫెయిల్ అయ్యారట. కానీ ఆ సమయంలోనే ప్రేమలో పడ్డ మనోజ్ కుమార్ శర్మ జీవితం ఒక్కసారిగా అనుకోనంతగా మారిపోయింది. శర్మ శ్రద్ధా జోషితో ప్రేమలో పడ్డా తాను XII ఫెయిల్ కావడంతో ఆమెకు తన ప్రేమని చెప్పలేకపోయారట. కానీ కొద్ది రోజుల తర్వాత ఎలానో ఒకలా ధైర్యం చేసుకుని ‘నువ్వు నా ప్రేమను అంగీకరిస్తే.. నేను ఈ ప్రపంచాన్ని గెలుస్తాను’ అని ఆమెకు ప్రపోజ్ చేశారు శర్మ.
ఆమెకు ప్రపోజ్ చేసిన దగ్గర నుంచి నిజంగానే కష్టపడడం మొదలుపెట్టారు శర్మ. UPSC పరీక్షలకు కఠినంగా కష్టపడి చదివారు.. తన ఫీజుల కోసం ఆయన చేయని ఉద్యోగాలు లేవు. టెంపో నడపడం దగ్గర్నుండి.. వాకింగ్ డాగ్స్ వరకు ఢిల్లీలో ఉన్న అన్ని రకాల పనులు చేసి మరి ఫీజులు కడుతూ వచ్చారు. పని చేస్తూ చేస్తూ ఢిల్లీ వీధుల్లో నిద్రపోయిన రోజులు కూడా చవి చూశారు శర్మ. ఎంతో కష్టపడి చదివిన.. UPSC CSE పరీక్షలో మూడుసార్లు ఫెయిల్ ఫైల్ అయ్యారు. అయినా తన సంకల్పం వదలని శర్మ ఫైనల్ గా నాల్గవ ప్రయత్నంలో 121వ ర్యాంకుతో విజయం సాధించారు. ఇక తన కళ నెరవేరి IPS ఆఫీసర్ అయ్యారు మనోజ్ కుమార్ శర్మ.
ఈ కథని ఈ సినిమాగా తెరకెక్కించారు. తన కుటుంబం ఆర్థిక సమస్యలు తొలగించాలని అలానే తను జోషి పై పెంచుకున్న ప్రేమ గెలవాలని ఎంతో కష్టపడి ఐపీఎస్ అయ్యారు శర్మ. కాగా ఆయన భార్య జోషి IRS అధికారిణి. ప్రస్తుతం మహారాష్ట్ర టూరిస్ట్ డిపార్ట్ మెంట్‌లో పని చేస్తున్నారు.
ఇక ఆయన బయోపిక్ గా వచ్చిన ఈ 12th ఫెయిల్ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్ డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది అలానే IMDB లో అత్యంత ర్యాంక్ సంపాదించుకున్న చిత్రంగా మిగిలింది.
Also read: Yash: యాష్ పుట్టినరోజు తీవ్ర విషాదం.. ముగ్గురు అభిమానులు మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook