Vishal: ప్రజల కోసం పోరాడుతా.. రాజకీయ ఎంట్రీ పై విశాల్ క్లారిటీ!

Vishal Political Entry: దేశంలో సినీ హీరో హీరోయిన్లు రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసిన పరిస్థితి ఎక్కువగా మనం దక్షిణ భారత దేశంలోనే చూస్తుంటాం. అందులోనూ తమిళనాడులో కాస్త ఎక్కువ ఈ వాతావరణం మనకు కనబడుతుంది. ఈ నేపథ్యంలో మన హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. ప్రకటించగా విశాల్ కూడా రాబోతున్నారు అనే వార్త గట్టిగా వినిపించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 7, 2024, 12:50 PM IST
Vishal: ప్రజల కోసం పోరాడుతా.. రాజకీయ ఎంట్రీ పై విశాల్ క్లారిటీ!

Vishal in Politics: సినీ పరిశ్రమ సెలబ్రిటీస్ ఎంతోమంది రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సందర్భాలు మనం ఎక్కువగానే చూసాము. ముఖ్యంగా తమిళనాడులో ఎంతోమంది హీరో హీరోయిన్లు రాజకీయాల వైపు మొగ్గు చూపించారు. ఎంజీఆర్, జయలలిత, విజయ్ కాంత్, కమల్ హాసన్, కుష్బూ దగ్గర నుంచి ప్రస్తుతం విజయవాడకు ఎంతోమంది రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ముఖ్యంగా గత కొద్ది రోజుల క్రితం తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నాను అంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వడం తో తమిళ రాజకీయాలు వార్తల్లో నిలిచాయి. 

ఈ హీరో రాజకీయాల్లోకి రావడం వల్ల అక్కడ ఏ పార్టీపై ఎక్కువగా ప్రభావం ఉంటుంది అనే విషయంపై ఇంకా కూడా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో మరో హీరో కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు అంటూ తమిళ మీడియా ప్రచారం చేయడం సాగింది. ఇంతకీ ఎవరు ఆ హీరో అంటే తమిళం తో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో చేరువైన హీరో విశాల్. పందెంకోడి సినిమాతో తెలుగులో సైతం సూపర్ హిట్ అందుకున్న ఈ హీరోకి తమిళనాడులో మంచి పేరు ఉంది. ముఖ్యంగా ఎక్కువ మందికి సహాయపడుతూ కనిపిస్తాడు ఈ హీరో. అంతేకాకుండా ఏమున్నా ముక్కుసూటిగా మీడియా ముందు మాట్లాడేస్తూ ఉంటారు. అందుకే కొన్నిసార్లు వివాదాల్లో కూడా చిక్కుకుంటూ ఉంటారు. అయితే ఈ హీరో రాజకీయాల్లోకి రాబోతున్నారు అని ఎన్నో సంవత్సరాల నుంచి వార్తలు వస్తున్నాయి. కానీ విజయ్ తన రాజకీయ పార్టీ ప్రకటించిన దగ్గర నుంచి విశాల్ పొలిటికల్ ఎంట్రీ కూడా ఖాయం అంటూ వార్తలు రాసాగాయి.

ఈ వార్తలు జోరు అందుకోవాడంతో ఈ విషయంపై ఏకంగా విశాలే స్పందించారు. ‘నాకు ఇంత గుర్తింపు హోదా ఇచ్చిన ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటా. నాకు చేతనైన అంత సహాయం చేయాలని ఉద్దేశంతో దేవి ఫౌండేషన్ ద్వారా ఎందరినో ఆదుకున్న. విద్యార్థులను చదివిస్తున్న. రైతులకు సాయం చేశా. లాభాలను ఆశించి ఏ పని చేయను. ఇప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు. కాలం నిర్ణయిస్తే ప్రజల కోసం పోరాడుతా’ అని తెలియజేశారు.

 

కాగా ఈ హీరో ఇదే విషయాన్ని తెలియజేస్తూ తన సోషల్ మీడియాలో లేఖ విడుదల చేశాడు. మొత్తానికి దీన్ని బట్టి విశాల్ ఇప్పుడల్లా రాజకీయాల్లోకి రావడం లేదని అయితే ఫ్యూచర్ లో వచ్చే ఆలోచనలు తప్పకుండా ఉన్నాయని తెలుస్తోంది.

Also read: Seerath Kapoor: హీట్ పుట్టిస్తోన్న సీరత్ కపూర్ లేటెస్ట్ ఫోటో షూట్.. పిక్స్ వైరల్..

Also read: White Hair Problem: తెల్ల వెంట్రుకలు నల్ల బడేందుకు అద్భుతమైన చిట్కా, ఆ రెండు వస్తువులు కలిపితే చాలు

 

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News