Mega House : మెగా ఇంట్లో అప్పుడే మొదలైపోయిన పెళ్లి హడావిడి..

Wedding Celebration : వరుణ్ తేజ్ మరియు హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఈ మధ్యనే నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జంట ఇప్పుడు పెళ్లికి సిద్ధం అయింది. వీరి పెళ్లి ఇటలీలో నంబర్ 1వ తేదీన అంగరంగ వైభవంగా జరగనుంది. ఇప్పటినుంచే మెగా ఇంట్లో పెళ్లి హడావిడి మొదలైపోయింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 29, 2023, 11:09 AM IST
Mega House : మెగా ఇంట్లో అప్పుడే మొదలైపోయిన పెళ్లి హడావిడి..

Mega Wedding : మెగా హీరో వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి ఎంతో కాలంగా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. గతంలో విరి పెళ్లికి ప్రేమ లేదా పెళ్లికి సంబంధించి ఎన్ని పుకార్లు వినిపించినప్పటికీ ఈ జంట వాటిని తెలివిగా కొట్టిపారేస్తూ వచ్చింది. కానీ ఈ మధ్యనే ఈ ఏడాది జూన్ 9న వీరి నిశ్చితార్థంతో వీరి గురించి వస్తున్న పుకార్లకి శుభం కార్డు పడినట్లు అయింది.

తాజాగా ఈ జంట ఇప్పుడు నవంబర్ 1 వ తేదీన ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు. అయితే వీరి పెళ్లి వేడుకలో కేవలం మెగా మరియు అల్లు కుటుంబాలతో పాటు కొద్దిమంది స్నేహితులు మాత్రమే హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో మెగా ఇంట్లో ఇప్పటికే పెళ్లి హడావిడి బాగా మొదలైపోయింది. వీరి పెళ్లి కోసం బంధువులు అందరూ ఒక దగ్గరకి చేరుకున్నారు.

ఇప్పటికే ఇటలీ కి వెళ్ళిపోయిన వరుణ్ తేజ్ మరియు లావణ్య తమ షాపింగ్ ని కూడా పూర్తి చేసుకున్నారు. వారి ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. వీరిద్దరి మొహంలో అప్పుడే పెళ్లికళ వచ్చేసింది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. పెళ్లికి ముందు నుంచి ఇటలీ లో వరుణ్ మరియు లావణ్య కొంత సమయాన్ని గడుపుతున్నారు.

రేపు అనగా అక్టోబర్ 30న వీరి ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలు కాబోతున్నాయి. వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి ఇటలీ లోని టుస్కానీ లో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇక అక్టోబర్ 30న ఒక కాక్టైల్ పార్టీ కూడా జరగబోతోంది. మెగా మరియు అల్లు కుటుంబ సభ్యులు ఈ పెళ్ళికి హాజరు కాబోతున్నారు.6 పెళ్లి తర్వాత హైదరాబాద్ తిరిగి వచ్చాక నవంబర్ 5న ఇండస్ట్రీలోని అతిధుల కోసం వరుణ్ మరియు లావణ్య ఒక చిన్న రిసెప్షన్ కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక సినిమాలపరంగా చూస్తే ఈ మధ్యనే గాంధీవదారి అర్జున సినిమాతో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన వరుణ్ తేజ్ ప్రస్తుతం ఆపరేషన్ వాలెంటైన్ మరియు మట్కా అనే సినిమాలతో బిజీగా ఉన్నారు. మరోవైపు లావణ్య త్రిపాఠి ఎప్పుడో 2022లో హ్యాపీ బర్త్డే అనే సినిమాలో కనిపించింది. ఇప్పుడు తనల్ అనే ఒక తమిళ్ సినిమాలో కూడా నటిస్తోంది.

Also Read: Jio Annual Plans: కొత్తగా జియో ప్రీపెయిడ్ వార్షిక ప్లాన్స్ ఈ ఓటీటీలు ఉచితం

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News