ఉత్కంఠరేపుతున్న కళ్యాణ్ రామ్ 118 టీజర్

కళ్యాణ్ రామ్ నటించిన 118 మూవీ టీజర్ 

Last Updated : Dec 18, 2018, 01:10 PM IST
ఉత్కంఠరేపుతున్న కళ్యాణ్ రామ్ 118 టీజర్

తన ప్రతీ సినిమాను భిన్నంగా చూపించేందుకు, ఎప్పటికప్పుడు తనని తాను ఇంకా కొత్తగా మల్చుకునేందుకు ప్రయత్నించే నందమూరి కళ్యాణ్ రామ్ చేస్తున్న కొత్త సినిమా 118. కేవి గుహన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన నివేదా థామస్, 'అర్జున్ రెడ్డి' ఫేమ్ శాలినిపాండే ఫీమేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. తాజాగా మేకర్స్ 118 మూవీ టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ ద్వారా సినిమాపై ఒకింత ఉత్కంఠరేపడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. ప్రతీ జీవితాన్ని ఏదో ఓ ఘటన అనుకోని మలుపు తిప్పుతుందన్నట్టుగానే ఈ సినిమాలో లీడ్ రోల్స్ పోషించిన కళ్యాణ్ రామ్, శాలిని పాండేల జీవితాలు కూడా హాయిగా సాగుతున్నాయనుకుంటున్న తరుణంలోనే ఒకరోజు చోటుచేసుకున్న ఓ ఊహించని ఘటన వారి జీవితాలను మరో మలుపు తిప్పిందని టీజర్ చూస్తే స్పష్టమవుతోంది. ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది ? వారి జీవితం ఏ మలుపు తిరిగిందనే ఉత్కంఠను రేకెత్తించే విధంగా మేకర్స్ ఈ టీజర్‌ను డిజైన్ చేశారు.

Trending News