Bollywood: ముంబైలో మరో నటుడు ఆత్మహత్య కలకలం

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఘటనను మరిచిపోకముందే ముంబైలో మరో నటుడు (Akshat Utkarsh Death News) బలవన్మరణం చెందాడు. సినిమా అవకాశాల కోసం ఇబ్బంది పడుతున్న నటుడు అక్షత్ ఉత్కర్ష్ ఆత్మహత్య (Akshat Utkarsh Dies) చేసుకోవడం కలకలం రేపుతోంది. 

Last Updated : Sep 29, 2020, 05:37 PM IST
Bollywood: ముంబైలో మరో నటుడు ఆత్మహత్య కలకలం

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఘటనను మరిచిపోకముందే ముంబైలో మరో నటుడు ఆత్మహత్య (Actor Akshat Utkarsh Dies) చేసుకోవడం కలకలం రేపుతోంది. బాలీవుడ్ నటుడు అక్షత్ ఉత్కర్ష్(26) ముంబై, అంధేరిలోని తన అపార్ట్‌మెంట్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకుని నటుడు ఆత్మహత్య (Akshat Utkarsh Commits Suicide) చేసుకున్నాడు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం నటుడి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. బాలీవుడ్‌లో అవకాశాల కోసం ఇబ్బంది పడుతున్నాడని సమాచారం. 

బిహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన నటుడు అక్షత్ ఉత్కర్ష్ పలు భోజ్‌పురి సినిమాల్లో నటించాడు. అయితే హిందీ చిత్రసీమలో తన లక్ పరీక్షించుకునేందుకు ముంబైకి మార్చాడు. ఈ యంగ్ హీరో స్నేహ చౌహాన్ అనే యువతితో సహజీవనం చేస్తున్నాడని, వీరిద్దరూ ముంబై, అంధేరి పశ్చిమ ప్రాంతంలో గోకుల్ అనే బిల్డింగ్‌లో నివాసం ఉంటున్నారని దైనిక్ జాగరణ్ తన కథనంలో పేర్కొంది. 

 

 

ఆదివారం రాత్రి తన ఇంటికి నటుడు ఫోన్ చేయగా, వారు కొంత సమయం తర్వాత్ ఫోన్ చేస్తానని చెప్పారట. కుటుంబసభ్యులు తిరిగి ఫోన్ చేయగా నటుడు అక్షత్ ఫోన్ లిఫ్ట్ చేయలేదని చెబుతున్నారు. కొంతసేపయ్యాక.. నటుడి ప్రియురాలు స్నేహ వారికి కాల్ చేసి అక్షత్ సూసైడ్ చేసుకున్నాడని వారి గుండె బద్ధలయ్యే షాకింగ్ విషయాన్ని చెప్పింది. వారు సోమవారం ముంబైకి చేరుకున్నారు. ఇప్పటికీ జరిగిన దారుణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని పోలీసులు తెలిపారు. Happy Birthday Sneha Reddy: భార్య బర్త్‌డేను సెలబ్రేట్ చేసిన అల్లు అర్జున్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Trending News