Balakrishna Bumper Offer: బాలయ్య ఫాన్స్ కు బంపర్ ఆఫర్.. ఆయన్ని కలవాలంటే ఇలా చేయండి!

Aha Video Bumper Offer: మీరు నందమూరి అభిమానులా? బాలకృష్ణకు వీర అభిమానులా? అయితే మీకోసమే ఆహా వీడియో ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 7, 2022, 12:26 PM IST
Balakrishna Bumper Offer: బాలయ్య ఫాన్స్ కు బంపర్ ఆఫర్.. ఆయన్ని కలవాలంటే ఇలా చేయండి!

Aha Video Bumper Offer to Nandamuri Balakrishna Fans: నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ అనే షోతో తెలుగు ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. గత ఏడాది అంటే 2021 సంవత్సరంలో ఈ షోకి సంబంధించిన మొదటి సీజన్ ఎపిసోడ్లు రిలీజ్ అయ్యాయి. మునుపెన్నడూ లేని విధంగా నందమూరి బాలకృష్ణ ఈ షోలో కనిపిస్తూ ఉండడంతో బాలకృష్ణను కేవలం అయిన అభిమానులు మాత్రమే కాదు అందరూ ఇష్టపడడం మొదలుపెట్టారు.

నందమూరి బాలకృష్ణ లోని మరో కోణాన్ని ఆవిష్కరింపజేసిన ఈ షో కి సంబంధించిన సెకండ్ సీజన్ కూడా ఇప్పుడు ప్రారంభమైంది. సెకండ్ సీజన్లో మొదటి ఎపిసోడ్ ఏకంగా చంద్రబాబు, లోకేష్ లతో ప్లాన్ చేసిన ఆహా యాజమాన్యం ప్రతి ఎపిసోడ్ ని మరింత స్పెషల్ గా ప్లాన్ చేస్తూ వస్తోంది. ఇప్పటికే బాలకృష్ణ స్నేహితులు కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డి, టాలీవుడ్ హీరోలు అడివి శేష్- శర్వానంద్, సిద్దు జొన్నలగడ్డ-విశ్వక్ సేన్ వంటి వాళ్లతో ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తూ ఆసక్తి రేకెత్తిస్తున్నారు.

ఇక కేవలం వీళ్ళలోనే కాదు అల్లు అరవింద్, సురేష్ బాబు, కే. రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి ఇలా ఆసక్తికరమైన కాంబినేషన్స్ సెట్ చేస్తూ ముందుకు వెళుతున్నారు. అయితే చాలా మందికి నందమూరి బాలకృష్ణతో కలిసి అన్ స్టాపబుల్ షోలో నేరుగా ఆ గెస్ట్ లను వీక్షించాలనే కోరిక ఉంటుంది. ఇప్పుడు అలాంటి వారందరికీ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది ఆహా వీడియో యాజమాన్యం. తాజాగా సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ప్రకటించింది.

చందనా బ్రదర్స్ వారి బంపర్ ఆఫర్ అంటూ బాలయ్య వేసుకున్న గ్రీన్, రెడ్ అండ్ వైట్ సూట్లు పెట్టి ఆ ఎపిసోడ్ నెంబర్ గెస్ చేయండి అన్ స్టాపబుల్ షోలో కనిపించే ఛాన్స్ కొట్టేయండి అంటూ గ్రీన్ కలర్, రెడ్ కలర్, వైట్ కలర్ సూట్స్ లో నందమూరి బాలకృష్ణ ఉన్న ఫోటోలను షేర్ చేశారు. దీంతో ఇక నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎక్కడా తగ్గడం లేదు. ఆ ఎపిసోడ్స్ ఏమిటో కూడా గెస్ చేసి మరీ ఆన్సర్ చెబుతున్నారు.

రెడ్ సూట్ మూడో ఎపిసోడ్ అని అందులో శర్వానంద్- అడివి శేష్ గెస్ట్లుగా వచ్చారని పేర్కొంటున్నారు. గ్రీన్ సూట్ నాలుగో ఎపిసోడ్లోది అని కిరణ్ కుమార్ రెడ్డి- సురేష్ రెడ్డి- రాధిక గెస్ట్లుగా వచ్చారని, వైట్ సూట్ ఐదవ ఎపిసోడ్ అని అల్లు అరవింద్- సురేష్ బాబు- కే రాఘవేంద్రరావు- కోదండరామిరెడ్డి గెస్ట్లుగా వచ్చారని కామెంట్ చేస్తున్నారు.

Also Read: North Korea: ఆమ్మో.. సినిమా చూశారని చిన్న పిల్లల్ని చంపేశారు.. దారుణ ఘటన వెలుగులోకి!

Also Read: Adah Sharma Hot Photos: బెడ్డెక్కి ఆదా శర్మ హాట్ ఫోజులు..అందాలన్నీ బహిర్గతం అయ్యేలా హాట్ ట్రీట్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 
 

Trending News