అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్: ‘నా పేరు సూర్య’ డైలాగ్ ఇంపాక్ట్ టీజ‌ర్ రిలీజ్

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్  బర్త్ డే ఈరోజు. టాలీవుడ్ ప్రముఖులంతా బన్నీకి పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేస్తున్నారు.

Last Updated : Apr 8, 2018, 05:24 PM IST
అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్: ‘నా పేరు సూర్య’ డైలాగ్ ఇంపాక్ట్ టీజ‌ర్ రిలీజ్

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్  బర్త్ డే ఈరోజు. టాలీవుడ్ ప్రముఖులంతా బన్నీకి పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేస్తున్నారు.కాగా నేడు బన్నీ బర్త్ డేని పురస్కరించుకొని ‘నా పేరు సూర్య’ డైలాగ్ ఇంపాక్ట్ టీజ‌ర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. అల్లు అర్జున్ తాజాగా న‌టిస్తున్న చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనూ ఇమాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ మూవీ మే 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ టీజర్‌లో ఓ విలన్‌ బన్నీని పట్టుకుని.. ‘సౌత్‌ ఇండియన్‌’ అని నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే బన్నీ అతన్ని కొట్టి ‘సౌత్‌ ఇండియా, నార్త్‌ ఇండియా, ఈస్ట్‌, వెస్ట్‌.. అన్ని ఇండియాలు లేవు రా మనకి. ఒక్కటే ఇండియా’ అని చెప్తున్న డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకొంటోంది.. మీరూ ఈ డైలాగ్ ఇంపాక్ట్ టీజ‌ర్‌ను చూడండి..

ఇది కూడా చదవండి: అల్లు అర్జున్‌ సైకత శిల్పం చెక్కిన ఫ్యాన్స్

Trending News