స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తర్వాతి సినిమా ఖరారైంది. ముచ్చటగా మూడోసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నట్టు అల్లు అర్జున్ అధికారికంగా ప్రకటించాడు. అభిమానులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెబుతూ అల్లు అర్జున్ తన తర్వాతి సినిమా వివరాలను ప్రకటించాడు. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్‌లో జులాయి, S/O సత్యమూర్తి వంటి సినిమాలు తెరకెక్కగా మూడోసారి ఈ ఇద్దరు కలిసి పనిచేయనున్న సినిమా అల్లు అర్జున్ కెరీర్‌లో మొత్తంగా 19వ చిత్రం కానున్నది. అల్లు అర్జున్ ప్రకటించిన వివరాల ప్రకారం ప్రముఖ నిర్మాతలు గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్, హారికా & హాసిని క్రియేషన్స్ బ్యానర్ అధినేత ఎస్ రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించనున్నారు.