నచ్చిన అమ్మాయిని ఎన్నిసార్లు ముద్దుపెట్టుకున్నా బోర్ కొట్టదు : అల్లు అర్జున్

టాక్సీవాలా ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌లో అల్లు అర్జున్ ఫన్నీ స్పీచ్ 

Last Updated : Nov 11, 2018, 10:46 PM IST
నచ్చిన అమ్మాయిని ఎన్నిసార్లు ముద్దుపెట్టుకున్నా బోర్ కొట్టదు : అల్లు అర్జున్

సినిమా పరిశ్రమలో ఎవరైనా పేరు తెచ్చుకోవడం కోసం చాలా కృషి చేస్తారు. కానీ వాళ్ల కృషికి ఫలితం దక్కాలంటే అందుకు ముందడుగు పడేది మాత్రం రచయితల వద్ద నుంచే. సినిమా వాళ్లకు పేరు తీసుకొచ్చే మంచి సాహిత్యాన్ని అందించే రచయితలకు ఎవరైనా, ఎప్పుడైనా ముందుగా గౌరవం ఇస్తే బాగుంటుంది అని చెప్పి అభిమానులను ఆకట్టుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన టాక్సీవాలా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఫంక్షన్ చివర్లో అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ చాలా ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నాడు. టాక్సీవాలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపైకి వచ్చిన అనంతరం మొదటిగా ఆ చిత్ర కథ రచయిత సాయిరామ్‌ని వేదికపైకి పిలిపించుకున్న అల్లు అర్జున్.. టాక్సీవాలాతో ఒక మంచి కథను అందించావు అంటూ అతడి భుజం తట్టి ప్రోత్సహించాడు. విజయ్ దేవరకొండ సినిమా ఫంక్షన్స్‌కి పదేపదే రావడం గురించి మాట్లాడుతూ.. "నచ్చిన అమ్మాయిని ఎన్నిసార్లు ముద్దుపెట్టుకున్నా బోర్ కొట్టదు.. పెద్దగా ఇబ్బంది అనిపించదు.. తాను పదేపదే విజయ్ దేవరకొండ సినిమా ఫంక్షన్స్‌కి రావడం కూడా అటువంటిదే" అని చెప్పి అభిమానులను నవ్వించాడు అల్లు అర్జున్.  

విజయ్ దేవరకొండ తనకు తాను చెక్కుకున్న శిల్పం. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా నుంచి మొదలుపెడితే, పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి వంటి సినిమాల వరకు ఎంతో కష్టపడి తనని తాను స్టార్ హీరోను చేసుకున్న నటుడు విజయ్ దేవరకొండ. అందుకే విజయ్ దేవరకొండ అంటే తనకు చాలా అభిమానం అని చెప్పి విజయ్ దేవరకొండపట్ల స్టైలిష్ స్టార్ తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు.

Trending News