ప్రముఖ సినీనటి అమలాపాల్ అరెస్ట్ అయ్యారు. రిజిస్ట్రేషన్ కై తప్పుడు చిరునామా పత్రాలు సమర్పించినందున ఆమెను అరెస్ట్ చేశారు. తిరువనంతపురం క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ఎదుట హాజరైన ఆమెను.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అరెస్టైన కొద్ది సమయానికే ఆమె విడుదల అయ్యారు.
గత ఏడాది కోటి రూపాయలతో అమలాపాల్ ఒక కారును కొనుగోలు చేశారు. ఆ కారును స్థానికంగా రిజిస్టర్ చేయిస్తే 20 లక్షలు పన్ను చెల్లించాలి. ఈ పన్ను నుంచి తప్పించుకొనేందుకు ఆమె పుదుచ్చేరి వెళ్లారు. పుదుచ్చేరిలో కారును కొనుగోలు చేశారు. కేంద్రపాలిత ప్రాంతాల్లో రుసుములు తక్కువనే కారణంతో ఆమె ఈ పని చేసినట్లు కనిపిస్తుంది. అక్కడ కారును కొనుగోలు చేసేటప్పుడు తప్పుడు పత్రాలు సమర్పించింది. ఈ కారణంతోనే ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకొని... కాసేపటికే విడుదల చేశారు.