'సైరా'లో చిరంజీవికి గురువుగా బిగ్‌బీ..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'సైరా నరసింహారెడ్డి' సినిమాలో అమితాబ్ బచ్చన్ ఎలా ఉండనున్నారో తెలిసిపోయింది.

Last Updated : Mar 29, 2018, 09:53 AM IST
'సైరా'లో చిరంజీవికి గురువుగా బిగ్‌బీ..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'సైరా నరసింహారెడ్డి' సినిమాలో అమితాబ్ బచ్చన్ ఎలా ఉండనున్నారో తెలిసిపోయింది. ఈ మేరకు తన లుక్‌ను  రివీల్ చేస్తూ 'సూపర్ స్టార్ చిరంజీవి అదే ఫ్రేంలో ఒక గౌరవం ఉండాలి' అంటూ అమితాబ్ తెలుగులో ట్వీట్ చేశారు. ఈ సినిమాలో స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి బిగ్‌బీ గురువుగా కనిపించనున్నట్లు తెలుస్తుండగా.. భారీ గడ్డంతో ఉన్న రాజా లుక్ ఎంతగానో ఆకట్టుకుంటోంది.

 

రెండు రోజుల క్రితమే.. 'సైరా' షూటింగ్ కోసం హైదరాబాద్‌కి వెళ్తున్న సమయంలో బిగ్‌బీ తన పాత్ర బహుశా ఇలానే ఉంటుందని తన బ్లాగ్ ఒక ఫోటో పోస్టు చేశారు. అయితే ఈ లుక్‌ను ఇంకా ఫైనల్‌ చేయలేద‌ని, దాదాపు ఇలాగే ఉంటుంద‌ని చెప్పారు.

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఈ సినిమాకి దర్శకుడు సురేందర్‌ రెడ్డి కాగా, ప్రముఖ సినీ నటుడు, చిరంజీవి తనయుడు రామ్ చ‌ర‌ణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో బిగ్‌బీ  అమితాబ్ కీలక పాత్రలో న‌టిస్తున్నారు.  ‘సైరా’లో అమితాబ్‌తోపాటు నయనతార, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు, సుదీప్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ, బాలీవుడ్‌కి చెందిన అమిత్‌ త్రివేది సంగీతం స‌మ‌కూర్చనున్నాడు.

Trending News