'సైరా'లో అమితాబ్ లుక్..

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’

Last Updated : Mar 28, 2018, 06:10 AM IST
'సైరా'లో అమితాబ్ లుక్..

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఈ సినిమాకి దర్శకుడు సురేందర్‌ రెడ్డి కాగా, ప్రముఖ సినీ నటుడు, చిరంజీవి తనయుడు రామ్‌చర‌ణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో బిగ్‌బీ అమితాబ్ కీలక పాత్రలో న‌టిస్తున్నారు. పాత్ర చిన్నదే అయినా ఆ  పాత్ర‌లో న‌టించేందుకు అమితాబ్ ఆసక్తిని కనబర్చారట..!

సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు హైద‌రాబాద్ చేరుకున్నారు బిగ్‌బీ. అంత‌కు ముందు త‌న పాత్ర గురించి బిగ్‌బీ త‌న బ్లాగ్‌లో ప్ర‌స్తావించారు. సినిమాలో తన లుక్‌కు ఫొటోను పోస్ట్ చేశారు..అయితే ఈ లుక్‌ను ఇంకా ఫైనల్‌ చేయలేద‌ని, దాదాపు ఇలాగే ఉంటుంద‌ని చెప్పారు. ఈ మూవీలో న‌టించేందుకు ఎందుకు ఒప్పుకున్నానో వివ‌రిస్తూ, ‘ప్రియమైన స్నేహితుడు, తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖుడైన చిరంజీవి.. అత్యంత సాహసోపేతమైన పాత్రలో నటిస్తున్న గొప్ప చిత్రంలో నన్ను నటించమని కోరారు.. నేను ఒప్పుకొన్నా. ఈ సినిమా చిత్రీకరణ కోసం మరికొన్ని గంటల్లో హైదరాబాద్‌కు బయలుదేరుతున్నా. ఫస్ట్‌లుక్‌ టెస్ట్‌లు జరుగుతున్నాయి’ అని అమితాబ్‌ బ్లాగ్‌లో పేర్కొన్నారు.

‘సైరా నరసింహారెడ్డి’లో అమితాబ్‌తోపాటు నయనతార, విజయ్‌ సేతుపతి, జగపతిబాబు, సుదీప్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ, బాలీవుడ్ కి చెందిన అమిత్‌ త్రివేది సంగీతం స‌మ‌కూర్చ‌నున్నాడు.

Trending News