ఆ మొక్క ఆయుర్వేదానికే రారాజు

కింగ్ ఆఫ్ ఆయుర్వేద అని అనేకమంది ప్రముఖంగా పిలుచుకొనే ఔషధ మొక్క పేరు అశ్వగంధ

Last Updated : Sep 20, 2018, 11:42 PM IST
ఆ మొక్క ఆయుర్వేదానికే రారాజు

కింగ్ ఆఫ్ ఆయుర్వేద అని అనేకమంది ప్రముఖంగా పిలుచుకొనే ఔషధ మొక్క పేరు అశ్వగంధ. వైద్యపరంగా అశ్వగంధ లేహ్యం గురించి తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. కండరాల వ్యాధులకు ఎంతో ఉపశమనం కలిగించే మహా ఔషధం అశ్వగంధమని ఆయుర్వేద వైద్యులు అంటూ ఉంటారు. ఈ క్రమంలో అశ్వగంధ గురించి మనం కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం..

*తెలుగులో అశ్వగంధను  పెన్నేరుగడ్డ , పన్నీరు, పులివేంద్రం, వాజిగంధి అని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు.
*మనుషులు కోల్పోయే జ్ఞాపకశక్తిని తిరిగి ప్రసాదించే గుణం అశ్వగంధకి ఉందని శాస్త్రం చెబుతోంది.
*అశ్వగంధారిష్టం, అశ్వగంధాది లేహ్యం, అశ్వగంధి లక్సడి అనే పేర్లతో అశ్వగంధం ద్వారా తయారయ్యే రకరకాలు ఉత్పత్తులు నేడు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి.
*యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే అశ్వగంధంలో తెల్ల రక్తకణాలను బ్యాలెన్స్ చేసే శక్తి కూడా ఉంది.
*అశ్వగంధం వేర్లను పొడిచేసి చేసి పాలలో కలుపుకొని తాగితే అన్ని రకాల నొప్పులు నయం అవుతాయని అంటుంటారు.
*అశ్వగంధంతో చాలామంది టీ కూడా తయారుచేసుకుంటూ ఉంటారు. అశ్వగంధంతో తయారుచేసిన టీ తాగడం వల్ల మెదడులో నాడీసంబంధిత ప్రసరణ మెరుగుపడుతుందట
*గర్భిణీ స్త్రీల శరీరంలో రక్తాన్ని శుద్ది చేయడంలో కూడా అశ్వగంధం ప్రధాన పాత్ర పోషిస్తుందని అంటారు.
*కంటిశుక్లాల ద్వారా కలిగే సమస్యలను కూడా అశ్వగంధం తగ్గిస్తుందని కొన్ని ఆయుర్వేద గ్రంధాలు చెబుతున్నాయి.
*నాడీ వ్యవస్థను పునరుద్దపరచడానికి, నాడీ సంబంధిత వ్యాధులను తగ్గుముఖం పట్టించడానికి అశ్వగంధం ఎంతో ఉపయోగపడుతుంది.
*హెర్బల్స్‌లో డేటాలో రారాజు స్థానాన్ని ఆక్రమించిన అశ్వగంధ మూలికలను చూర్ణం చేసుకొని తాగడం వల్ల శరీరం ఉల్లాసవంతంగా ఉంటుందని కూడా చెబుతూ ఉంటారు.

Trending News