Badmash Gallaki Bumper Offer: నవ్వేందుకు రెడీ అయిపోండి.. ఈ నెల 29న 'బద్మాష్ గాళ్ళకి బంపర్ ఆఫర్'

Badmash Gallaki Bumper Offer Release Date: కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన మూవీ బద్మాష్ గాళ్ళకి బంపర్ ఆఫర్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ డిసెంబర్ 29న విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 27, 2023, 01:29 PM IST
Badmash Gallaki Bumper Offer: నవ్వేందుకు రెడీ అయిపోండి.. ఈ నెల 29న 'బద్మాష్ గాళ్ళకి బంపర్ ఆఫర్'

Badmash Gallaki Bumper Offer Release Date: ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్వించేందుకు 'బద్మాష్ గాళ్ళకి బంపర్ ఆఫర్' మూవీ రెడీ అయింది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం.. ఈ నెల 29న విడుదల కానుంది. నంది అవార్డ్ గ్రహీత రవి చావలి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. శాసనసభ చిత్రంతో హీరోగా మంచి గుర్తింపుతెచ్చుకున్న ఇంద్రసేన, మ్యాడ్ మూవీ ఫేమ్ సంతోష్ హీరోలుగా, ప్రజ్ఞ నయన్, నవీన రెడ్డి హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. ఎన్.రమేశ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 

ఇద్దరు కుర్రాళ్లు డబ్బు కోసం రియల్ ఎస్టేట్ దందా చేసే ఒక  వ్యక్తి దగ్గర పని చేస్తుంటారు. అతని వద్దే పని చేస్తూ.. అతన్నే ఎందుకు కిడ్నాప్ చేశారు..? ఆ కిడ్నాప్‌లో తెలిసిన సీక్రెట్స్‌ ఏంటి..? చివరకు ఆ ఇద్దరు కుర్రాళ్లు డబ్బు సంపాదించారా లేదా అనే పాయింట్‌తో కామెడీ యాంగిల్‌లో చూపిస్తూ.. ఫుల్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సినిమా తెరకెక్కింది. మలయాళీ నటి మెర్లిన్ ఫిలిప్, తమిళ యాక్టర్ తారక్, శుభలేఖ సుధాకర్ ప్రత్యేక పాత్రలో నటించారు. ఈ నెల 29న రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు.. బెంగళూరు, టెక్సాస్, అండమాన్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.

ఈ మూవీకి బిగ్ బాస్ ఫేం భోలే షవాలి సంగీతం అందించారు. విజయ్ సి కుమార్ కెమెరామేన్‌గా వ్యవహరించారు. ఎడిటింగ్ బాధ్యతలను మార్తాండ్ కె వెంకటేష్ నిర్వర్తించారు. ఘటికచలం మాటలు రాయగా.. హుస్సేన్ కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు.  

Also Read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

Also Read: Corona Jn.1 Precautions: దేశంలో కరోనా కొత్త వేరియంట్ భయం, లక్షణాలెలా ఉంటాయి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News