ప్రముఖ అగ్ర దర్శకుడు కన్నుమూత

Basu Chatterjee బసు చటర్జీ ఇక లేరు. బాలీవుడ్‌లో ప్రముఖ అగ్ర దర్శకుడిగా పేరొందిన బసు చటర్జీ జూన్ 3న ముంబైలో కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 90 ఏళ్లు. సాధారణ మధ్య తరగతి జీవితాల గురించి, వారి సామాజిక స్థితిగతుల గురించి కళ్లకు కట్టినట్టు హృద్యంగా తెరకెక్కించడంలో ఎవరైనా బసు చటర్జీ తర్వాతే. రజనిగంధ, చోటీ సి బాత్, ఖట్టా మీటా, బాతో బాతో మే, శౌకీన్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఆయన తెరకెక్కించినవే.

Last Updated : Jun 4, 2020, 02:53 PM IST
ప్రముఖ అగ్ర దర్శకుడు కన్నుమూత

Basu Chatterjee బసు చటర్జీ ఇక లేరు. బాలీవుడ్‌లో ప్రముఖ అగ్ర దర్శకుడిగా పేరొందిన బసు చటర్జీ జూన్ 3న ముంబైలో కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 90 ఏళ్లు. సాధారణ మధ్య తరగతి జీవితాల గురించి, వారి సామాజిక స్థితిగతుల గురించి కళ్లకు కట్టినట్టు హృద్యంగా తెరకెక్కించడంలో ఎవరైనా బసు చటర్జీ తర్వాతే. రజనిగంధ, చోటీ సి బాత్, ఖట్టా మీటా, బాతో బాతో మే, శౌకీన్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఆయన తెరకెక్కించినవే. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాల్లో ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. సినీ రంగంలోనే కాకుండా టెలివిజన్ రంగంలోనూ బసు చటర్జీ తనదైన ముద్ర వేసుకున్నారు. దూరదర్శన్‌లో ఒకప్పుడు సూపర్ హిట్ అయిన బ్యోంకేశ్ బక్షి, రజని బసు చటర్జీ డైరెక్ట్ చేసినవే. దూరదర్శన్‌లో ఈ రెండు సిరీస్‌లు అప్పట్లో ఓ పెను సంచలనం. కరోనాతో ప్రముఖ సంగీత దర్శకుడు వాజిద్ ఖాన్ మృతి )

సామాజిక అంశాలను ఆకట్టుకునేలా తెరకెక్కించడంలోనూ బసు చటర్జీకి సిద్ధహస్తుడిగా పేరుంది. బసు చటర్జీ సామాజిక అంశాల ఆధారంగా డైరెక్ట్ చేసిన ఏక్ రుకా హువా ఫైసలా, కమలా కీ మౌత్ లాంటి సినిమాలు ఆయన అభిరుచికి, మనసుకు అద్దం పట్టాయి.

చోటి సి బాత్, ఉస్ పార్, చిచోర్, రజనిగంధ, పియా కా ఘర్, ఖట్టా మీటా, చక్రవ్యూహా, బాతో బాతో మే, ప్రియతమ, మన్ పసంద్, హమారి బహు అల్క, శౌకీన్, చమేలీ కీ శాదీ, ఏక్ రుకా హువా ఫైసలా, కమలా కీ మౌత్ లాంటి చిత్రాలకు ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. 

బసు చటర్జీ మృతిపై ఇండియన్ ఫిలిం అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ (IFTDA) అధ్యక్షుడు అశోక్ పండిట్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తంచేశారు. చటర్జీ మృతి బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు తీరని లోటంటూ బాలీవుడ్ ప్రముఖులు ఆవేదన వ్యక్తంచేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News