అలాంటి వాటికి ప్రచారకర్తగా ఉండను: అమితాబ్ బచ్చన్

తాను ఎట్టిపరిస్థితిల్లోనూ అలాంటి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండనని బాలీవుడ్‌ మెగాస్టార్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్ అన్నారు‌.

Last Updated : Jun 3, 2018, 12:17 PM IST
అలాంటి వాటికి ప్రచారకర్తగా ఉండను: అమితాబ్ బచ్చన్

మద్యం, పొగాకుకు సంబంధించిన ఉత్పత్తులకు తాను ఎట్టిపరిస్థితిల్లోనూ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండనని బాలీవుడ్‌ మెగాస్టార్‌ బిగ్‌‌బీ అమితాబ్‌ బచ్చన్ అన్నారు‌. తాను ఏ ఉత్పత్తులనైతే వాడతానో వాటికే అంబాసిడర్‌గా ఉంటానన్నారు.

'నాకు ఏదన్నా ఉత్పత్తి నచ్చి, నేను దానిని వాడుతూ ఉంటేనే ప్రచారకర్తగా ఉంటాను. మద్యం, పొగాకుకు సంబంధించినవి ఉంటే నేను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రచారం చేయను. ఎందుకంటే నేను ఆరోగ్యానికి హాని కలిగించే ఇలాంటి వాటికి (మద్యం, పొగాకు) దూరంగా ఉంటాను. నేను ఈ అవార్డుకు అర్హుడినో కాదో తెలీదు కానీ అడ్వర్టైజ్మెంట్ రంగంలో నేను చేస్తున్న పనిని గుర్తించి నన్ను అభినందించినందుకు కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. మహారాష్ట్ర ముంబైలో శనివారం నిర్వహించిన ‘క్యూరియస్‌ క్రియేటివ్‌ అవార్డ్స్‌’ కార్యక్రమంలో అమితాబ్‌ అవార్డు అందుకున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల అమితాబ్‌, రిషి కపూర్‌ నటించిన ‘102 నాటౌట్‌’ చిత్రం విడుదలై ఘన విజయం సాధించింది. ప్రస్తుతం అమితాబ్‌ బాలీవుడ్ లో ‘బ్రహ్మాస్త్రా’, ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’, తెలుగులో ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాల్లో నటిస్తున్నారు.

 

Trending News