Bigg Boss Ashu Reddy : అనాథ పిల్లల్ని చదివిస్తున్న అషూ రెడ్డి.. అందరినీ గెలిచేసిన బిగ్ బాస్ బ్యూటీ

Bigg Boss Ashu Reddy Social Service బిగ్ బాస్ అషూ రెడ్డి అంటే కేవలం అందాల ఆరబోత మాత్రమే అని అనుకునే వారికి తాజాగా షాక్ తగిలింది. ఆమె బోల్డ్ ఫోటో షూట్లు చూసి తిట్టుకునే వారు ఇప్పుడు తమ తప్పుని తెలుసుకుని లెంపలేసుకుంటున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 26, 2022, 07:32 AM IST
  • అనాథలకు అషూ రెడ్డి సాయం
  • పిల్లల్ని చదివిస్తోన్న అషూ
  • మంచి మనసుకు నెటిజన్లు ఫిదా
Bigg Boss Ashu Reddy : అనాథ పిల్లల్ని చదివిస్తున్న అషూ రెడ్డి.. అందరినీ గెలిచేసిన బిగ్ బాస్ బ్యూటీ

Bigg Boss Ashu Helps Orphans Studies అషూ రెడ్డి అంటే అందరికీ ఓ భావన ఉంటుంది. అందాల ఆరబోత, ఆర్జీవీతో పాడు ఇంటర్వ్యూలు తప్పా ఇంకేం ఉంటుందిలే అని అనుకుని ఉంటారు. మొన్నటికి మొన్న ఆర్జీవీ చేత పాదాలు నాకించుకున్న అషూరెడ్డిని జనాలు దారుణంగా ట్రోల్ చేశారు. ఇంత కంటే నీచం ఉంటుందా? అని ఆమెను ఆడిపోసుకున్నారు. 

కానీ అషూ రెడ్డిలోని ఇంకో యాంగిల్‌ను ఎవ్వరూ గుర్తించలేకపోయారు. తాజాగా ఆమె చేసిన పోస్ట్ చూసిన నెటిజన్లు ఒక్కసారిగా ఎమోషనల్ అవుతున్నారు. అషూ రెడ్డిని తప్పుగా అనుకున్నాం.. నీలో ఇంత మంచితనం ఉందా? నీ నుంచి ఇలాంటివి ఎక్స్‌పెక్ట్ చేయలేదు అంటూ నెటిజన్లు ఆమెకు సలాం కొట్టేస్తున్నారు. అసలు ఇంతకీ అషూ రెడ్డి ఏం చేసిందంటే..

క్రిస్మస్ రోజున శాంటా వస్తాడని అంతా నమ్ముతారు.. ఇన్ని రోజులు నాకు దేవుడు ఇచ్చిన ఈ పిల్లల్ని పోషిస్తూ వచ్చాను.. సాయం చేస్తూ నాకు చేతనైనంతలో అండగా ఉన్నాను.. మరీ ముఖ్యంగా కళ్యాణి, శ్రేయాలను చదివించాను.. వారు డిగ్రీలు పూర్తి చేయడం నాకు ఆనందంగా ఉంది.. వారంతా కూడా నా జీవితంలోకి వచ్చినందుకు ఆనందంగా ఉంది.. వీరి ప్రేమను పొందేందుకు నాకేం అర్హత ఉందో నాకు తెలియడం లేదు.. 

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ashu Reddy (@ashu_uuu)

ఇప్పుడు నేను అందరికీ ఓ విషయం చెప్పదల్చుకున్నాను.. మీరు ఒక వేళ ఇతరుల పట్ల ప్రేమగా ఉంటూ దయను చూపించాలనుకుంటే.. అలా ఉండొచ్చు. ఒకరికి ఉపయోగపడేంత స్థోమత మనకు ఆ దేవుడు ఇస్తే ఇలా కచ్చితంగా సాయం చేయాలి.. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి థాంక్స్. మీరు కూడా వారి క్రిస్మస్‌ను హ్యాపీగా చేయాలనుకుంటే ట్రై చేయండి అని అషూ రెడ్డి చెప్పుకొచ్చింది.

అలా అషూ రెడ్డి మంచితనం చూసి జనాలు మాత్రం మారిపోయారు. ఆమెను చూసే కోణాన్ని మార్చుకున్నారు. ఇన్ని రోజులు ట్రోల్స్ చేసిన నెటిజన్లే ఆమె మంచి మనసును చూసి ఫిదా అవుతున్నారు. ఇలాంటి మంచి పనులు చేస్తూనే ఉండు అంటూ ఆమెను ఆశీర్వదిస్తున్నారు. మొత్తానికి అషూ మాత్రం అందరి మనసు దోచేసినట్టు కనిపిస్తోంది.

Also Read : Waltair Veerayya Review : వాల్తేరు వీరయ్యపై చిరంజీవి రివ్యూ.. సినిమా చూసి ఆ ఒక్క మాట చెప్పేశాడట!

Also Read : Sekhar Master : శేఖర్ మాస్టర్ ప్రయోగం.. సిరి, శ్రీహాన్‌లపై డబ్బులు పెడితే వస్తాయా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News